BC Times

తెలుగు 2 రాష్ట్రాల్లోని బిసి సామజిక వర్గాలకు సంబంధించిన నాయకులను మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పరిచయం చేయడమే లక్ష్యంగా BC Times చానెల్ పని చేస్తుంది. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న కుల సంఘాల, ప్రజా సంఘాల నాయకుల పరిచయంతో పాటు గ్రామ సర్పంచ్ నుండి పార్లమెంటు సభ్యుని వరకు వారి వారి సామజికవర్గాల వారిగా సమాజానికి పరిచయం చేయడం BC Times ఉద్దేశం.

ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న బిసి కులాలకు సంబంధించి అన్ని కుల సంఘాల, ప్రజా సంఘాల నాయకులను పరిచయం చేయాలని ప్రతి నియోజకవర్గంలో... గ్రామీణ నియోజకవర్గంలో 35 నుండి 40 కులాలు, పట్టణ ప్రాంత నియోజకవర్గంలో 40 నుండి 50 కులాల ప్రథినిధులు ఉన్నట్టు అంచనా. అలాంటి వారందరిని కూడా BC Times పరిచయ కార్యక్రమాల ద్వారా ఐక్యతతో వారిలో చైతన్యం తేవాలని BC Times ఆకాంక్ష. అందుకు అన్ని కులాల సహాయ సహకారాలు మునుపటివలే అందిస్తారని అశిస్తూ... జై ఫూలే