Andhra Pradesh Weatherman

ఉభయ తెలుగు రాష్టాల వాతావరణ సమాచారం, అప్డేట్లు. For Weather Forecasts and Updates for Andhra Pradesh and Telangana states.

ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖచ్చితత్వంతో, అందరికీ అర్ధం అయ్యే విధంగా అందించడమే లక్ష్యం. రోజు 10 నుంచి 12 గంటల సాఫ్ట్వేర్ ఉధ్యోగం చేసుకుంటూ ప్రజా సేవే లక్ష్యంగా చేస్తున్న కృషి ఇది. వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన కామెంటుని కామెంటు చేయండి, అలాగే తోటి మిత్రులతో ఈ ఛానల్ ని పంచుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని అందరికీ అందించడమే లక్ష్యం.

2021 లో ఐక్యరాజ్య సమితీలో (UN Habitat) ఒక స్ధానం సంపాదించాను. అలాగే భారత ప్రధానమంత్రి నుంచి అభినందనలు పొందాను. ఇవన్ని ఇంకా ఈ కృషిని పెంచడానికి చాలా తోడ్పడింది. తుఫాను వివరాల నుంచి చిన్న చిన్న వర్షాల వరకు అన్ని ఇక్కడ చెప్తాను. అప్పుడప్పుడు అందరకీ ఉపయోగపడేలాగ స్పెషల్ వీడియోలను తిస్తూ ఉంటాను.