విశ్వనాథ నవలా సాహిత్య స్రవంతి

పురాణాల చారిత్రికతను తిరస్కరించే ధోరణిని విశ్వనాథ సత్యనారాయణ పురాణవైరమన్నారు.
చారిత్రికాంశాలను పురాణాల నుంచి స్వీకరించి ఆయన పురాణవైర గ్రంథమాల రచించారు. ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్న మిది. అందుచేత దీనికి “పురాణవైరము” అని శీర్షిక ఏర్పరుపబడినది. అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.https:/#ancient history /literature/www.youtube.com/@padmapriyam9128