God Mission work

భూలోకమంతటికి సువార్త - పోవుట కిండియా ప్రధానము = పై లోకంబు నుండి వచ్చిన - బైబిలు మిషను ను ఎత్తి చూపుము

నేను చెప్పగ బైబిలు మిషను - లోనికి వచ్చిన క్షేమములు = జ్ఞానము మనస్సాక్షియును చెప్పిన - నేనేమియు ఆటంకము చేయను

నేను రమ్మనగ వచ్చి ఏ - వాని కడకు పోరాదు = నా నియమిత కార్యములు మాత్రమె - నడుపుము మానుకొనరాదు

బైబిలు మిషనును నేను బైలు - పరచిన సంగతి నమ్మనివారు = ప్రాబల్య బోధలు విని నన్ను - ప్రార్ధన జేసి కనుగొన రాదా

క్రొత్త విషయములు లేనిదె ఈ - క్రొత్త మిషను ఎందుకు రావలెను = క్రొత్తవి రాగా అన్ని మిషనులు - గొప్పగ పెరిగి మేఘంబెక్కును

అందరికి కనబడి మాట్లాడుదు - ననుటయె ఈ మిషను విశ్వాసము = కొందరి బోధలు వేరుగ నుండును - అందుకె మాటలాడను నేను

నీ జన్మ దినము నిమిత్తమై నేనెంతో కనిపెట్టియుంటి = ఈ జగతికి నీవు రాగానే - ఎంతో ఆనందించి యుంటి

ఈ కీర్తన నాకే నాకే యని - ఎవరన గలరో వారికే చెల్లును = ఈ కాలమునకు తగినవి చెప్పితి - యెరిగి సహించు కొనదగును

జనక సుతాత్మలను త్రైకునికి - సంస్తుతులు అని అనుకొనుము = అను దినము నీ యాత్మీయ జీ - వనము వృద్ధి యగును నమ్ముము

#BIBLEMISSION
#BIBLEMISSIONKAKANITHOTA #BIBLEMISSIONWORK