JACOB RAVINDRA BABU MACHARLA

IDHIGO...IDHIGO...ఇదిగో...ఇదిగో...ఇదిగో...చూడండి
మీ కొరకే రక్షకుడు జనియించు ఈనాడు.....
క్రిస్మస్..క్రిస్మస్..హ్యాపీ క్రిస్మస్..క్రిస్మస్ క్రిస్మస్
ఈ జగమంతటికి ఒకటే వేడుక
క్రిస్మస్..క్రిస్మస్..మెర్రీ క్రిస్మస్..క్రిస్మస్ క్రిస్మస్
నా బ్రతుకంతటికి ఒకటే పండుగ
ఆనందమే మహాదానందమే
ఆనందమే స్తుతి సంగీతమే
ఆనందమే పరమానందమే
ఆనందమే ఇక సంబరమే [ఇదిగో]
1) ప్రజలందరికిని మహాసంతోషమైన- సువార్తమానము మీకు తెలియ జెప్పెదను
దావీదు పట్టణమందు నేడు మీ కొరకు- రక్షకుడు పుట్టినాడు ప్రభువైన క్రీస్తు
పరలోక సైన్యము పాడెను ఈ పాట....ఇదే ప్రతి చోట ఇదే ప్రతి నోట
వేగిరమే రారండీ..వేడుకలే చేయండీ ౹౹ఇదిగో౹౹
2)సర్వోన్నతమైన స్థలముల యందున-సర్వోన్నతునికే మహిమా ఘనత
జ్ఞానులైనవారు గుర్తించగలిగారు-ఆయన నక్షత్రాన్ని వెంబడించి వచ్చారు
పరలోక సైన్యము పాడెను ఈ పాట-ఇదే ప్రతి చోట -ఇదే ప్రతి నోట
ఊరంతా వేడుకలే -మనమంతా కానుకలే
౹౹ఇదిగో॥