Edification Ministries Telugu

For more questions/doubts/clarifications, you can connect us at :

Email : [email protected]

ఒక వ్యకి యొక్క చర్య, క్రైస్తవ జ్ఞానం, ధర్మం, పవిత్రత మరియు ఆనందంలో మరొకరి పెరుగుదలను, క్షేమాభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశము కలిగి యుండవలెనని మనము (రోమ పత్రక 14:19, 15:2; 1కొరింథీయులకు 14:26; ఎఫెసీ 4:29) లో చూస్తున్నాము.

దేవుని సంపూర్ణ సంకల్పమును వ్యాప్తి చేయట "క్షేమాభివృద్ధి సేవా ఛానెల్" ముఖ్యఉద్దేశము.(అపొస్తలుల కార్యములు 20:27).

పాపులు నీతిమంతులుగా తీర్చబడుట అనేది ఒకే సారి జరిగించే చర్య, పవిత్రీకరణ క్రముముగా జరిగించే ఒక పని. నీతిమంతులుగా తీర్చబడుట అనేది తక్షణమే జరుగుతుంది. పవిత్రీకరణ అనేది ఒక ప్రగతిశీల పని క్రమంగా సాధించబడుతుంది. నీతిమంతులుగా తీర్చబడుటకు విశ్వాసి సహకరించడు, కాని కేవలం నీతిమంతులుగా తీర్చబడుటను అంగీకరించడం తప్ప. ఇది ప్రతి విశ్వాసిలో ఆయన కృప ద్వారా పూర్తయిన ఆయన న్యాయ చర్య; కానీ పవిత్రీకరణ జరిగించేదానిలో విశ్వాసి దేవునితో సహకరిస్తాడు.