Joyce Meyer Ministries Telugu

జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ తెలుగు అధికారిక యూట్యూబ్ చానల్ కు స్వాగతం. జాయిస్ మేయర్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అనుభవ పూర్వక బైబిల్ బోధకురాలు మరియు రచయిత్రుల్లో ఒకరు. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ ద్వారా, ఆమె మనస్సు, నోరు, ఆలోచనలు మరియు వైఖరుల వంటి అనేక అంశాలపై బోధిస్తారు. ఆమెకు మాత్రమే సాధ్యమైన తన సంభాషణా శైలి ఆమె అనుభవాలను ఇతరులతో బహిరంగంగా మరియు ఆచరణాత్మకంగా పంచుకొనుటకు అనుమతినిస్తుంది కాబట్టి ఇతరులు ఆమె అనుభవాలను తమ జీవితాల్లో అన్వయించుకొనుటకు సహాయపడుతుంది.

జాయిస్ గారు ప్రపంచ వ్యాప్తంగా "అనందించాలి ప్రతిదినం జీవితం" టి వి మరియు రేడియో కార్యక్రమాలకు ఆతిధ్యం వహిస్తున్నారు. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ పరిచర్యకు సహాయక హస్తమైన "హాండ్ ఆఫ్ హోప్" యొక్క దర్శనమునకు పునాది ఏదనగా ప్రతి రోజు గాయపడుచున్న ప్రజలకు సహాయపడాలన్న జాయిస్ యొక్క ఆశయే.