RK World Traveller

ఈ ప్రపంచం అంతా అద్భుతాల మయం!
ఆదమరిస్తే అగడ్తల నిలయం!
జీవితమే అనేక మలుపుల ప్రయాణం!
మలుపుకో మధుర జ్ఞాపకం!

హాయ్ ఫ్రెండ్స్… నేనూ మీ రామకృష్ణ (RK), నా ట్రావెల్ వ్లాగ్‌కు స్వాగతం. హైదరాబాద్ లో ఉంటూనే, అమెరికాలో సాఫ్ట్‌వేర్ కన్సల్టింగ్ కంపెనీని నెలకొల్పి దానికి CEO గా work చేస్తున్నా, ప్రపంచం చుట్టూ తిరిగి, బోల్డన్ని జ్ఞాపకాలని పోగు చేసుకుని, తెలుగు ప్రజలతో నా అనుభవాలను పంచుకుంటున్నా!

2024లో 108 దేశాలు సందర్శించడం, అక్కడి ప్రదేశాలను, ప్రజల జీవన విధానాలను నా ఛానల్ లో మీ అందరికీ చూపించడం నాకు అత్యంత ప్రియమైన విషయం.

ఇప్పటి వరకు 92 దేశాలను పర్యటించి, ఎన్నో విశిష్టమైన ప్రదేశాలను చూశాను. ప్రఖ్యాత ప్రదేశాల నుంచి, అరుదైన ప్రదేశాల వరకు, ప్రతీ ప్రయాణం ప్రత్యేకమైనది. ఈ ఏడాది చివరికల్లా 108 దేశాలను సందర్శించి ఒక ప్రపంచ స్థాయి రికార్డు సృష్టించాలని అభిలాష.

నా వీడియోల ద్వారా, మీరు కూడా నాతో ప్రయాణం చేసిన అనుభూతి పొందాలని, ప్రతి దేశపు అందం, సంస్కృతి, కథలు మీతో పంచుకుంటున్నాను.

తెలుగు ప్రజలందరికీ మన భూగోళం మొత్తం చూపించడమే నా ఉద్విగ్న స్వప్నం; ఈ అద్భుతమైన ప్రయాణంలో నాకు తోడ్పాటును అందించండి!