Mantha Siva Prasad

ట్రావెలింగ్ చేయడం అనేది ఇప్పుడే మొదలవలేదు...మనం గమనిస్తే రాజుల కాలం నుండే వివిధ దేశాల యాత్రికులు వివిధ దేశాలలో పర్యటించి అక్కడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక , రాజకీయ, అక్కడి ప్రజల జీవన విధానాన్ని పరిశీలించి అక్షర రూపంలో పదిల పరిచేవారు. ఉదాహరణకు చైనా యాత్రికుడు హుయెంథ్సాంగ్, అలాగే పాహిహాన్ ఇలా ఒకరా ఇద్దరా అనేకులు మన దేశంలో పర్యటించి ఇక్కడి విశ్వ విద్యాలయాల్లో జ్ఞానాన్ని సంపాదించి తిరిగి వారి దేశాలు వెళ్ళిపోయేవారు. అలా నేను నేను కూడా ఈ చిన్న జీవితంలో నాకున్న సమయంలో నా శక్తిమేర ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను..నా ఈ ప్రయాణంలోని అనుభవాలను , అనుభూతులను మీతో ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీతో పంచుకుంటాను.....
మీ ...శివ ప్రసాద్