Govinda seva

🙏🏼కృష్ణం వందే జగద్గురుం 🙏🏼

యః శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామ కారతః!
నస సిద్ది మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్!!
ఎవరైతే శాస్త్రములలో చెప్పబడిన ఆదేశాలను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్దిని కానీ, సుఖమును, ఆనందమును కానీ,చివరకు జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు.. భగవద్గీత 16-23.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యా కార్య వ్యవస్థితవ్!
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి!!
కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయము లో శాస్త్రమునే ప్రమాణముగా తీసికొనుము, శాస్త్ర విధి విధానాలను, ఉపదేశాలను తెలిసికొనుము,మరియు ఆ విధంగానే ఈ జగత్తు లో ప్రవర్తించుము. భగవద్గీత :16-24
సనాతన ధర్మ ప్రచారం,భగవద్గీత, రామాయణ, భారత, భగవతాది ధార్మిక గ్రంధాల ప్రచారం,అన్య మతాల బారి నుండి హిందువులను జాగృత పరచడం, సనాతన ధర్మ ముసుగులో ఉన్న ధార్మిక సంస్థలలో అవక తవకలను ప్రశ్నించడం, సిద్ధాంతపరంగా చర్చించి ఖండించడం, తద్వారా హిందూ బంధువులలో అవగాహనను, చైతన్యాన్ని కలిగించడం, సనాతన ధర్మం దిశ గా జాతిని నడిపించడం ఈ ఛానల్ ప్రధాన ఉద్దేశ్యం 🚩
ఓ హిందూ మేలుకో
నీ ధర్మం తెలుసుకో
నీ జాతి ని జాగృతం చేయి 🚩