mr_parshu official

🔔🫵Subscribe chesukondi bayya❤️😍


🔔🚩🚩సద్గురు: ‘హిందూ సనాతన ధర్మం’ అంటూ ఏమీ లేదు. అది ‘సనాతన ధర్మం’ అంతే. ‘సనాతన’ అంటే, శాశ్వతమైనదని అర్ధం. శాశ్వతం అంటే ఎప్పటికీ ఉండే సత్యం అని అర్ధం.

ఈ ఉనికికే ఆధారమైనసనాతన ధర్మం అనేది జీవితంలోని ఎప్పటికీ మారని పార్శ్వానికి సంబంధించింది. ఒక వానపాము, కీటకం, పక్షి లేదా ఒక మొక్క, ఏదైనా సరే, అన్నిటికీకూడా ఈ ఉనికికి వర్తించే ప్రాథమికనియమాలే వర్తిస్తాయి,అదే సనాతన ధర్మం. మనిషిపై మనిషి నియంత్రణ కోసమో, సమానత్వం కోసమో సంఘంలో పెట్టుకున్న శిక్షాస్మృతులు కావు ఇవి.ఎందుకంటే, ఆ లావాదేవి చట్టాలు తర తరానికీ మారిపోవాల్సి ఉంటుంది. అది వేరే విషయం. మనం మాట్లాడేది లావాదేవిచట్టం గురించి కాదు, మనం మాట్లాడేది ఎప్పటికీ నిలిచి ఉండే ధర్మం గురించి.