Blender Telugu by Padmasri

అందరికీ నమస్కారం, నా పేరు పద్మశ్రీ. నేను ఎం.ఎస్‌.సి ఫిజికల్ కెమిస్ట్రీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ లో చేసాను.
నేను 2018 నుండి త్రీడీ ప్రొడక్ట్ మోడలింగ్, టెక్స్చరింగ్, లైటింగ్ మరియు రెండరింగ్ చేస్తున్నాను.

నాకు బ్లెండర్ని నా స్వంత తమ్ముడు అఖిల్ కుమార్ నేర్పించాడు. బ్లెండర్ ఎలా వాడాలో, ఏ టూల్ ఏం చేస్తుందో అన్నది కూడా నా తమ్ముడే నాకు నేర్పించాడు. మా మమ్మీ జమున, నాకు ఎప్పుడూ “విద్యాదానం మహాదానం” అని చెప్తూ ఉంటుంది. “నీకు తెలిసిన దానిని యూట్యూబ్ లో పెట్టు, నేర్చుకునే వాళ్లకు ఉపయోగపడుతుంది” అని మా మమ్మీ చెప్పిన తర్వాతనే నేను ఈ ఛానల్ ను స్టార్ట్ చేసాను.

నేను వ్యక్తిగతంగా ఎలాంటి కోర్సెస్ ఇవ్వను. అలాగే బ్యాచెస్ క్రియేట్ చేసి ట్రైనింగ్ కూడా ఇవ్వను. నాకు ఎక్స్పీరియెన్స్ తో వచ్చిన నాలెడ్జ్ ని ఉచితంగా పంచడమే నాకు ఇష్టం. ఎవరైనా నా ఛానల్ పేరు చెప్పి డబ్బులు అడిగితే, అలాంటి వారిని నమ్మకండి, వారికి డబ్బులు ఇవ్వకండి.

ఫ్రీలాన్స్ 3D ప్రాజెక్ట్స్ కోసం నేను అందుబాటులో ఉన్నాను.
మీరు ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటే, details & price వివరాలు Instagram ద్వారా పంపండి.