AP State Food Commission Chairman

జాతీయ ఆహార భద్రత చట్టానికి లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ పని చేస్తుంది .

1. పౌర సరఫరాల శాఖ:- చౌక దుకాణాల ద్వారా రైస్ కార్డు దారులకు రేషన్ సరుకులు పంపిణీ.
2 . ICDS (అంగన్వాడి కేంద్రాలలో పంపిణీ జరుగు పౌష్టిక ఆహారము)
3. మధ్యాహ్న భోజన పథకం మరియు అన్ని సంక్షేమ వసతి గృహాలు/గురుకులంలలో ఇచ్చే ఆహారము.
4. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం. (మహిళల మొదటి కాన్పుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5000/- మరియు రెండవ డెలివరీనందు ఆడ బిడ్డ అయితే రూ.6000/- ఇచ్చే పథకం)

పై పథకాలకు సంబంధించి ఎటువంటి లోటు పాట్లు ఉన్న సవరించడం , సంబంధిత అధికారులను అప్రమత్తం చేయటం, తప్పులు ఎక్కువగా ఉన్నచో సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడం, జరిమానాలు విధించడం, అవక తవకలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవలసినదిగా సంబంధిత శాఖల ఉన్నత అధికారులకు సిఫారసు చేయడం ఆహార కమీషన్ యొక్క ముఖ్య విధివిధానాలు.

అలాగే పై పథకాలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులను అయిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వీడియోలను పంపి ఫిర్యాదు చేయగలరు. ఫిర్యాదు చేయవలసిన వాట్సప్ నెంబర్ : 9490551117