SUNITA DHARUR

అందరికీ నమస్కారం. నా పేరు SUNITA DHARUR ,సూరత్ నుంచి. సూరత్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.ఈ సూరత్ వజ్రాలకు మరియు వస్త్ర రంగాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరం. అలాంటి ఈ సూరత్ నగరం నుంచి అక్కడ ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక్కడి దొరికే వస్త్రాలను పరిచయం చేయదలచాను. ఇక్కడ వేల సంఖ్యలో మార్కెట్ లు ఉన్నాయి.మళ్ళా ప్రతి మార్కెట్ లో వందల సంఖ్యలో షాప్ లు ఉన్నాయి. వీటితో పాటు ఎన్నో బట్టల ఫ్యాక్టరీ లు ఉన్నాయి. కావున హోల్ సెల్ వ్యాపారం చేసే వాళ్లకు ఇది ఎంతో అనుకూలమైన నగరం. ఇక్కడి నుంచే జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా బట్టలు export జరుగుతుంటుంది. అందువల్ల ఈ నగరం ను మన రెండు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసి ఉద్యోగ, ఉపాధి కల్పనల విషయంలో నా వంతు పాత్ర నిర్వహించడానికి ఇక్కడ ఏ బట్ట ఏ మార్కెట్ లో ఏ షాప్ లో ఎంత రేట్ కు దొరుకుతుందో చూపించే ప్రయత్నం లో భాగంగా వీడియోల రూపం లో చూపించాలని ఈ SUNITA DHARUR అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. మరీ సూరత్ లో ఉన్న నాకు అక్కడ ఉన్న మీకు వేల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ నిండు మనసు తో నన్ను ఆశీర్వదించి దీవించాలని కోరుతూ...
-మీ
SUNITA DHARUR