పలమనేరు గంగవరం లో గంజాయి విక్రయం పై పోలీసులు ఉక్కుపాదం
Автор: ANTV AP
Загружено: 2025-12-02
Просмотров: 708
చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం లో గంజాయి పట్టివేత,
రాష్ట్రంలో మాదకద్రవ్యాల నివారణలో భాగంగా
పోలీసులు
నిరంతరం దాడులు కొనసాగిస్తున్నారు.చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూది, IPS వారి ఆదేశాల మేరకు పలమనేరు DSP డి. ప్రభాకర్ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక తనిఖీలు జరుగుతున్నాయని DSP D. ప్రభాకర్ గారు తెలిపారు,
పలమనేరు గంగవరం లో గంజాయి విక్రేతలు అరెస్ట్,
31,500 రూపాయలు విలువైన గంజాయి సరకు స్వాధీనం,
పలమనేరు ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేసిన రూరల్ పోలీసులు, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపారు.
నిర్దిష్ట సమాచారం మేరకు, పోలీసులు గంగవరం బసపురం క్రాస్ వద్ద మెరుపు దాడి చేసి షేక్ మస్తాన్ (A1) మరియు శ్యామల (A2) అనే ఇద్దరిని పట్టుకున్నారు.
వారి నుంచి సుమారు రెండు కిలోల వంద గ్రాముల (2.1 kg) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలు (₹31,500) ఉంటుందని అంచనా.
పోలీసుల విచారణలో, నిందితురాలు శ్యామల ఈ గంజాయిని విజయవాడ సమీపంలో కొనుగోలు చేసినట్లు అంగీకరించింది.
నిందితులపై NDPS చట్టం కింద Cr.No.149/25 కేసు నమోదు చేశారు.
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు ఇద్దరినీ తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించారు.
గంజాయి రవాణాపై ఏపీ పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారనడానికి
ఈ సంఘటనే నిదర్శనం. ప్రజలు కూడా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కోరిన చిత్తూరు జిల్లా SP మరియు పలమనేరు DSP
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: