Brushing is no Fun: Learn Telugu with subtitles - Story for Children and Adults "BookBox.com"
Автор: BookBox
Загружено: 2023-02-08
Просмотров: 681
Rohan does not like to brush his teeth or take a bath. But his sister Riya tells him a secret that changes his mind!
Get our FREE App for Android: https://bit.ly/2oAUev9 and for iOS: https://apple.co/2Isv5th
Subscribe for new videos every week!: / @bookbox619
More Telugu AniBooks: • గజపతి కులపతి : Learn Telugu with subtitles...
Similar AniBooks: https://studio.youtube.com/video/7F5o...
బ్రష్ చేయడం మజాకా కాదు
రచన: శ్రీవిద్య వెంకట్
రోహన్ లేచిన వెంటనే తన కుక్క,
జిమ్మీతో ఆడుకోవడం మొదలుపెట్టాడు.
“నువ్వు పొద్దున్నే లేచాక
ముందు ఏమి చెయ్యాలో తెలుసా?”
అక్క రియా అంది.
“పళ్ళు తోముకోవాలి.”
వూఫ్!
“నాకు పళ్ళు తోముకోవడం ఇష్టం లేదు.
జిమ్మీ ఏమి పళ్ళు తోముకోదు కదా?”
“జంతువులు వాటి సంరక్షణ
వేరే విధంగా చేసుకుంటాయి.
మనం మన పళ్ళని తోముకుంటే,
దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
లేకపోతే క్రిములు వచ్చేస్తాయి,”
“క్రిములా?”
“క్రిములంటే మనం చూడలేని
చిన్న బూచులు.
నువ్వు సరిగ్గా పళ్ళు తోముకోపోతే,
అవి నీ నోట్లోనే ఉండి,
నీ పళ్లకి హానిచేస్తాయి.”
“అమ్మో!”
“అవును... అందుకే మన పళ్ళని
మనమే శుభ్రంగా ఉంచుకోవాలి.
ఉదయం లేచినవెంటనే,
రాత్రి పడుకునే ముందు
తప్పకుండా పళ్ళు తోముకోవాలి.”
“కానీ నాకు పళ్ళు తోముకోవడం
అస్సలే ఇష్టం లేదు.”
“నేను నీకు ఒక రహస్యం చెప్తాను రోహన్!
ష్...” రోహన్ నవ్వాడు.
అంతలో అమ్మ అల్పాహారాని కి రమ్మని
పెద్దగా పిలిచింది.
“అక్కడికి వెళ్లేముందు
మనం చేతులు కడుక్కోవాలి,”
అన్నది రియా.
వూఫ్!
“కానీ జిమ్మీ ఎప్పుడూ చేతులు కడుక్కోదు కదా?”
రియా నవ్వి “జిమ్మీ తన కాళ్ళు,
చేతులు మన లాగా వాడదు కదా.
మన చేతుల మీద వున్న క్రిములు పోవాలంటే
చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.”
“క్రిములు మన చేతుల మీద కూడా ఉంటాయా?”
“క్రిములు అన్నిచోట్లా ఉంటాయి!”
వూఫ్!
తరువాత రియా రోహన్ కి
చేతులు సరిగ్గా ఎలా కడుక్కోవాలో నేర్పించింది.
“ముందు చేతులని నీటితో కడుక్కో.
ఆ తర్వాత సబ్బుతో చేతుల ముందు వెనకాల,
వేళ్ళ మధ్యలో కూడా కడుక్కోవాలి.
ఇరవై సెకండ్లపాటు
చేతులని రుద్దిరుద్ది కడుక్కోవాలి.
ఆ తర్వాత నీళ్లతో కడుక్కొని ఆరపెట్టుకోవాలి.”
“కానీ ఇది చాలా సేపు పడుతుంది!”
“నా రహస్యం గుర్తుంది కదా?”
రోహన్ చిన్నగా నవ్వాడు.
ఆటలు ఆడటం అయిపోయాక,
రియా మరియు రోహన్ ఇంటికి వచ్చారు.
“ఇప్పుడు మనం ఒక పని చెయ్యాలి,”
అని రియా రోహన్ కి గుర్తుచేసింది.
అమ్మ, “ఇంకా ఆడుకోవాలా?”
అని ఆట పట్టించింది.
“ముందు స్నానం చెయ్యాలి!
క్రిములు అన్నిచోట్లా వుంటాయి.
మనం వాటిని చూడలేము కానీ
అవి మన చర్మం మీద,
బట్టల మీద కూడా ఉంటాయి!
వాటిని నిర్మూలించడానికి
మనం ప్రతి రోజు స్నానం చెయ్యాలి!”
“ముందు నీటితో వంటిని తడుపుకో,”
అని అంది అమ్మ.
“ఆ తర్వాత సబ్బుతో రుద్దుకో!”
అమ్మ తన చేతివేళ్ళతో
చక్కిలిగిలిగింతలు పెడుతూ
వారి శరీరం అంత సబ్బుతో రుద్దింది.
“ఇప్పుడు నీటితో కడిగేసుకోవాలి!”
“ఆ తర్వాత పొడి టవల్తో
తుడిచేసుకోవాలి!”
“అంతా శుభ్రం!”
వూఫ్!
“ఇప్పుడు ఒక కథ వింటారా?”
అని నాన్న అడిగారు.
“నాన్నా! పడుకునేముందు
మనం చేయవలసిన పని ఒకటి వుంది.”
అని రియా రోహన్ ని పట్టుకుంటూ లాగింది.
“మా రహస్యంతో
మేము క్రిములని మాయం చేస్తాం,”
అని రోహన్ తల ఆడించాడు.
కొన్ని నిమిషాల తర్వాత,
అమ్మ నాన్నకు ఒక పాట వినిపించింది.
“ఓహ్... అదన్నమాట మీ రహస్యం!”
అన్నారు నాన్న.
“పళ్ళు తోముకోవడం తో పాట పాడితే
సరదాగా ఉంటుందనా?”
“చేతులు కడుక్కునేటప్పుడు కూడా!”
“అది చాలా మంచి ఆలోచన!”
అన్నది అమ్మ.
రోహన్ మరియు రియా
వారి సంరక్షణ వారు చూసుకుంటున్నారు.
మరి మీరు?
Story: Srividhya Venkat
Illustrations: Anupama Ajinkya Apte
Music: Rajesh Gilbert
Animation: BookBox
This story has been provided for free under the CC-BY license by Pratham Books, which is a not-for-profit children's books publisher with a mission to see "A book in every child's hand". Visit http://www.prathambooks.org to know more. Artwork has been adapted from the original book while the animation, music and narration have all been done by BookBox.
WEBSITE: http://www.bookbox.com
FACEBOOK: / bookboxinc
INSTAGRAM: / bookboxinc
TWITTER: / bookboxinc
#BookBox #BookBoxTelugu #Learn2Read
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: