స్మిత సబర్వాల్ దివ్యాంగుల సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి I T21 News I Smita Sabharwal
Автор: T21 NEWS TELUGU
Загружено: 2024-07-27
Просмотров: 427
దివ్యాంగులను కించపరిచేలా వాఖ్యాలు చేసిన IAS అధికారిని స్మిత సబర్వాల్ దివ్యాంగుల సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈరోజు NPRD India వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దివ్యంగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా NPRD INDIA జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, రాష్ట్ర అధ్యక్షులు దైనంపల్లి మల్లికార్జున్ లు మాట్లాడుతూ దివ్యాంగులకు సివిల్ సర్విస్ రిజర్వేషన్లు అవసరం లేదని దివ్యంగులలో ఆత్మగౌరవం దెబ్బతినేలా స్మిత సబర్వాల్ కుట్రపూరిత వాఖ్యాలు చేశారని భారతరాజ్యాంగాన్ని, భారత పార్లమెంట్ చేసిన చట్టాలను పరిరక్షించాల్సిన భాద్యతయుతమైన IAS హోదలో పని చేస్తున్న సీత సబర్వాల్ ఈలాంటి వాఖ్యాలు చేయడం దివ్యాంగులను అవమానించడమే కాక . రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే అన్నారు. స్మిత సభర్వాల్ ను ప్రభుత్వ విధులనుండి తొలగించాలని, సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక గ్రేటర్ హైదరాబాద్ నాయకులు శబరీ చావ్లా, ధనమ్మ , సైదులు , భాస్కర్ నాయక్ , గంగమ్మ, హనుమ నాయక్, జానీ, నరసింహ, పుష్పా రాణి తదితర వికలాంగులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: