మునగాకు చపాతీ | Munagaku chapati | Lunch Recipes | Healthy Recipes | Chapati Recipes l roti recipes
Автор: HomeCookingTelugu
Загружено: 2025-10-05
Просмотров: 20180
మునగాకు చపాతీ | Munagaku chapati | Breakfast Recipes | Healthy Recipes | Chapati Recipes | @HomeCookingTelugu
#munagakuchapati #healthyrecipes #homecookingtelugu
మునగాకు చపాతీ :
కావాల్సిన పదార్ధాలు :
గోధుమపిండి - 2 కప్పులు ( 250 ml )
తరిగిన అల్లం - 2 టీస్పూన్లు
పచ్చిమిరపకాయ - 1
పసుపు - 1/4 టీస్పూన్
కారం - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
వాము - 1 టీస్పూన్
నూనె - 2 టీస్పూన్లు
మునగాకులు
నీళ్ళు
నెయ్యి
తయారీ విధానం :
ముందుగా రెండు కప్పులు ( 250 ml ) గోధుమపిండి తీసుకొని , అందులో రెండు టీస్పూన్లు తరిగిన అల్లం , గింజలు తీసేసి సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ , పావు టీస్పూన్ పసుపు , అరా టీస్పూన్ కారం , అరా టీస్పూన్ ధనియాలపొడి , అరా టీస్పూన్ జీలకర్ర పొడి , ఒక టీస్పూన్ ఉప్పు , ఒక టీస్పూన్ వాము కాస్త నలిపి వేసుకోవాలి.
తరువాత రెండు గుపేడ్లు మునగాకు , రెండు టీస్పూన్లు నూనె వేసి చపాతీ పిండిలా కొద్దీ కొద్దిగా నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి.కలుపుకుని పిండి ని మూత పేటి పది నిముషాలు నానపెట్టుకోవాలి.పది నిముషాలు తరువాత పిండి ని కొద్దీ కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి.చేసుకున్న ఉండను పొడి పిండి లో ముంచి పలచటి చపాతీలా అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి.పెనం కానీ తవ కానీ పెట్టుకొని పెనం వేడిన తరువాత చపాతీ వేసి రెండు పక్కల పది నుంచి పదిహేను సెకండ్లు కలుచుకోవాలి.చపాతీ కాస్త కాలిన తరువాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుచుకోవాలి.రెండు పక్కల బాగా కాలిన తరువాత తీసేసుకుంటే ఎంతో టేస్టీ ఐనా మునగాకు చపాతీలు రెడీ ఇనట్లే , వీటిని రైతా తో కానీ పచ్చడి తో కానీ సర్వ్ చేసుకుంటే చాల బాగుంటాయి.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
You can buy our book at https://shop.homecookingshow.in/
Follow us :
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : http://www.ventunotech.com

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: