రాష్ట్రంలో 16వ స్థానంలో వేంకటగిరి ప్రజాదర్బార్
Автор: JP News
Загружено: 2025-12-10
Просмотров: 494
భూసమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రజాదర్భార్ కార్యక్రమం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. డక్కిలి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఆయన ప్రజల వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ …
*వైసీపీ పాలనలో భూముల రీసర్వే అడ్డగోలుగా నిర్వహించడంతో గ్రామాల్లో భూ తగాదాలు భారీగా పెరిగాయని విమర్శించారు. రికార్డులను తారుమారు చేయడం, ఒకరి భూమిని మరొకరి పేరుమీదకు మార్చి రైతులను ఇబ్బంది పెట్టడం అప్పటి ప్రభుత్వ హయాంలో సాధారణమైందని తెలిపారు. ఆ గందరగోళమే ఫ్రీహోల్డ్ జారీ ప్రక్రియ ఆలస్యానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు .
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజల మధ్యకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా విని వెంటనే పరిష్కారం చూపే విధంగా ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇకపై భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా భూ ఆక్రమణలపై పకడ్బందీ చట్టం ప్రభుత్వం తెస్తుందని చెప్పారు
డక్కిలి సమీపంలోని సంగనపల్లి వద్ద నవోదయ పాఠశాల మంజూరు అవడం వల్ల డక్కిలి విద్యాహబ్‌గా మారబోతోందని తెలిపారు. అదేవిధంగా డక్కిలిలో పశువుల హస్టల్ ను కూడా మంజూరు చేయించామని వెల్లడించారు. దీంతో డక్కిలి రూపురేఖలు మారనున్నాయన్నారు.
*ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాధవాయపాలెం సొసైటీ అధ్యక్షులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు , డక్కిలి మండల అధ్యక్షులు పొలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి , పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: