Swayambhu Venkateswara Swamy Temple | Konaseema Tirupathi vadapalli | ఏడు శనివారాల వెంకన్న దర్శనం
Автор: jajula creations
Загружено: 2026-01-17
Просмотров: 176
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే ఏడు పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల నమ్మకం,
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర ప్రకారం, ఈ క్షేత్రం గోదావరి ఒడ్డున వెలసి,
1700-1759 మధ్యకాలంలో గొప్ప వ్యాపారవేత్త పినపోతు గజేంద్రుడుచే నిర్మించబడింది;
స్వామివారు రాతితో కాకుండా నల్లని చెక్కతో స్వయంభువుగా వెలిశారని,
ఏడు వారాల పాటు స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని,
వివాహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం, అందుకే దీనిని 'కోనసీమ తిరుపతి'గా పిలుచబడుతుంది.
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే ఏడు పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల నమ్మకం. ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి పూజలు చేస్తారు
#Vadapalli #Venkateswaraswamy #History :
కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీనివాసుడు స్వయంభువుగా వెలసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఏడు శనివారాలు ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని విశ్వాసం. ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
వాడపల్లి ఎక్కడ ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుంచి 6 కి.మీ దూరంలో వాడపల్లి గ్రామం ఉంది. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారు. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభువుగా వెలసిన్నట్లు స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
ఆలయ పౌరాణిక గాథ
పూర్వం సనకసనందాది మహర్షులు వైకుంఠంలో నారాయణుని దర్శించుకోడానికి వచ్చి భూలోకంలో పాపాలు, అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగి పోతున్నాయని, వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధేయపడతారు. అప్పుడు ఆ నారాయణుడు ఎప్పుడెప్పుడు ధర్మం గాడి తప్పుతుందో అప్పడు తాను ధర్మ స్థాపనకు పూనుకుంటానని చెప్పారు. అలాగే కలియుగంలో అర్చా స్వరూపంతో భూలోకంలో మానవుల పాపాలను కడుగుతున్న గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశంలో లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో చేరుకుంటానని పలుకుతాడు. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు.
చందన పేటికలో స్వామి వారు
కొద్దిరోజులకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్లిన వాళ్లకు అది మాయమై పోతుండేది. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు చూడలేకున్నారు. తెలవారక ముందే అందరూ శుచిగా గౌతమీ నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో తానున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. అంతటా ప్రజలు స్వామి చెప్పిన విధంగా చేయగా చందన పేటికలో శంఖ, చక్ర, గదాయుదుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామస్థులు సంతోషించి ఆ అర్చావతార రూపమునకు గౌతమీ తీరాన దేవాలయం నిర్మించి స్వామిని ప్రతిష్ఠ చేసి పూజించుట ప్రారంభిస్తారు.
వాడపల్లి ఆలయ స్థల పురాణం
వాడపల్లి గ్రామాన్ని పూర్వం "నౌకాపురి" అని పిలిచేవారు. గతంలో నాసికా త్రయంబకేశ్వర నుంచి వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకుని రాగా, నారద మహర్షి స్వామి వారిని కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్టించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు.
శ్రీనివాసుని స్వప్న సాక్షాత్కారం
ఒకసారి వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసి గోదావరి నదిని వరద ముంచెత్తి నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు. ఒకసారి పెద్ద తుపాను సంభవించడం వల్ల ఆ పడవలు అన్ని సముద్రంలో కలిసిపోతాయి. తన పడవలు సముద్ర గర్భం నుంచి బయటకు వస్తే, వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుంచి బయటకు తీసి ఆలయం నిర్మించి ప్రతిష్టిస్తాను అని మొక్కుకుంటారు. ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు నౌకలు అన్ని నది ఒడ్డుకు చేరడం వల్ల అన్న మాట ప్రకారం స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు.
vadapalli venkateswara swamy temple #history of #vekanna temple #news #hindutemple #telugu #andhrapradeshnews #konaseematirumala
#vadapalli #venkateswara #swamy #temple
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: