స్తుతి సింహాసనాసీనుడానా ఆరాధనకు పాత్రుడా..
Автор: Sunny Rythems 2349
Загружено: 2025-12-06
Просмотров: 94
స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి||
నా వేదనలో నా శోధనలో
లోకుల సాయం వ్యర్థమని తలచి (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి||
నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ సముఖములో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి||
నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: