ఆత్మీయ గానాలతో || Athmiya Gaanalatho || Telugu Christian worship song l Pastor Jacob Pasunuri
Автор: Jacob Pasunuri BCOG
Загружено: 2026-01-18
Просмотров: 225
ఆత్మీయ గానాలతో || Athmiya Gaanalatho || Telugu Christian worship song l Pastor Jacob Pasunuri
ఈ వీడియోలో హృదయాన్ని తాకే ఆత్మీయ గానాలు (Telugu Christian Songs) ఉన్నాయి.
ప్రార్థన, ఆరాధన, కోసం ఈ గీతాలు ఎంతో సహాయపడతాయి.
ఈ పాటలు మీ హృదయానికి శాంతి, ఆశ, విశ్వాసాన్ని అందిస్తాయి.
ప్రతి రోజు దేవునితో సమయం గడపడానికి ఈ ఆత్మీయ గానాలు వినండి.
🙏 మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి
📌 మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి
🔔 కొత్త పాటల కోసం బెల్ ఐకాన్ నొక్కండి
LYRICS:
ఆత్మీయ గానాలతో
నిన్నే ఆరాధన చేయనా
స్తుతి స్తోత్ర గీతాలతో
నీ నామము పూజించనా (2)
మహిమ ఘనత ప్రభావములు
నీకే చెల్లించుచున్నానయ్యా (2)
ఆరాధించనా నీ పాద సన్నిధి (2)
స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా
ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ||
సమీపించరాని తేజస్సులో
వసియించుచున్న పరిశుద్ధుడా (2)
కెరూబులు సెరాపులు (2)
దీవా రాత్రులు నీ సన్నిధిలో (2)
స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి పాత్రుడా||
అందరిలోను అతి శ్రేష్టుడా
వేల్పులలోన మహనీయుడా (2)
పూజార్హుడా స్తోత్రార్హుడా (2)
అతి సుందరుడా మనోహరుడా (2)
చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2) ||స్తుతి పాత్రుడా||
అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా
అపరంజిని పోలిన పాదాలు గలవాడా (2)
(దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన (2)
స్వరమును కలిగిన ఘననీయుడా (2)
శిరము వంచనా సర్వోన్నతుడా (2) ||స్తుతి పాత్రుడా||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: