రక్షక తంత్రాలు | Defence Mechanism | Psychology Classes In Telugu | AP TET & DSC 2024-25 Psychology
Автор: It's me mani official
Загружено: 2024-11-27
Просмотров: 262
రక్షక తంత్రాలు | Defence Mechanism | Psychology Classes In Telugu | AP TET & DSC 2024-25 Psychology
#psychologyclass
#apdsc2024
#rakshakathanthralu
#dscpsychology
#tetpsychology
#apdsc
#psychology
Follow Me On Youtube:-
@annamaniperikala1477
రక్షక తంత్రాలు
పరిచయం:- వ్యాకులతను, ఒత్తిడిని, సంఘర్షణను తగ్గించుకోవడానికి మానవులు అనేక రకాలైన పద్ధతులను ఉపయోగిస్తారు. వాటిలో ముఖ్యమైనవి రక్షక తంత్రాలు.. ఒత్తిడి, వ్యాకులత, కుంటనం అనేవి సంఘర్షణకు వ్యక్తి గురైనప్పుడు వ్యక్తి ఓటమిని అంగీకరించకుండా మధ్య మార్గంగా వ్యక్తి చేతనంగా, వచ్చేతనంగా ఉపయోగించే వాటిని రక్షకతంత్రాలు అంటారు.. ఇవి వ్యక్తి అహన్ని దెబ్బ తినకుండా చేస్తాయి. తాత్కాలికంగా మూర్తిమత్వమును విచ్చిన్నం కాకుండా కాపాడతాయి.
ఈ రక్షక తంత్రాలు అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టింది సిగ్మండ్ ఫ్రాయిడ్, ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన ప్రముఖ సైకాలజిస్ట్.. ఈయన ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం మనో విశ్లేషణ సిద్ధాంతం..J.B చాప్లిన్ తన గ్రంథమైన " Dictionary of psychology" లో మొదటగా ప్రస్తావించడం జరిగింది. ఈ గ్రంథంలో రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తన నమూనా అని చెప్పారు.
సిగ్నల్ ఫ్రాయిడ్ చెప్పిన 8 రక్షక తంత్రాలు
1. దమనం 2. ప్రతి గమనం
3. విస్తాపనం 4. స్వైరకల్పన
5. తాదాత్మీకరణం 6. పరిహారం
7. హేతుకీకరణం 8. ప్రక్షేపణం.
1. దమనం:- వ్యక్తి తనకు ఎదురైన బాధాకరమైన అనుభవాలను కావాలని మర్చిపోవడాన్ని ధమనం అంటారు.. ఇది అన్ని రక్షక తంత్రాలకు మూలమైనది.
ఉదా- రాజు తనకు బంధువుల ఇంటిలో జరిగిన అవమానాన్ని ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం.
2. ప్రతిగమనం:- సమస్యలు పరిష్కరించుకో లేనప్పుడు పెద్దవాళ్లు చిన్నపిల్లల వలె ఏడ్చేయడం.
ఉదా:- ఇంటర్వ్యూ కి వెళ్లిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడి వలె ఏడవడం ప్రారంభించాడు.
3. విస్తాపనం:- తన కోపతాపాలను తనకంటే బలహీనుల మీద ప్రదర్శించడం.
ఉదా- ప్రధానోపాధ్యాయుడి వద్ద చివాట్లు తిన్న ఉపాధ్యాయుడు తన కోపాన్ని ఇంటికి వచ్చి భార్యా పిల్లల మీద చూపించడం.
4. స్వైరకల్పన:- తీరని కోరికలను తన కలలో తీరినట్లు ఊహించుకోవడం.
ఉదా- పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి తాను స్టేట్ రాంక్ కొట్టి రాష్ట్రపతి చేతుల మీదగా బహుమతి తీసుకుంటున్నట్టు ఊహించుకోవడం.
5. తాదాత్మీకరణం:- తన ఆత్మీయులు సాధించిన విజయం లో తన విజయాన్ని చూసుకొని ఆనందించడం.
ఉదా-IAS కావాలనుకున్న వ్యక్తి తను సాధించలేనిది తన కొడుకు సాధించినప్పుడు తనే సాధించినట్టుగా ఆనందించడం.
6. పరిహారం:- ఒక అంశంలోని తన బలహీనతకు ప్రత్యామ్నాయంగా మరొక అంశంలో విజయాన్ని సాధించి గుర్తింపు పొందడం.
ఉదా- చదువులో అంతగా రాణించలేని సచిన్ టెండూల్కర్ క్రికెట్లో గొప్ప ఆటగాడు కావడం.
7. హేతుకీకరణం:- తనకు ఎదురైన వైఫల్యాలను కుంటి సాకులతో సమర్ధించుకోవడం.
ఉదా- పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ప్రయోజనం లేదు, ఉద్యోగాలు ఏవి వచ్చేలా లేవు అది తనను తాను సమర్ధించుకున్నాడు.
8. ప్రక్షేపణం- వ్యక్తి తనలో ఉన్న లోపాలను ఇతరులకు ఆపాదించడం.
ఉదా- పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి తను పాస్ కాకపోవడానికి కారణం టీచర్ సరిగా చెప్పలేదు అని టీచర్ మీదకి నెట్టి వేయడం.
. ఇది కాకుండా మరొక మూడు రక్షక తంత్రాలు ఉన్నాయి వాటిని కూడా మనం చూద్దాం.
9. ప్రతి చర్య నిర్మితి:- వ్యక్తి తనలో ఉన్న ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రవర్తించడాన్ని ప్రతి చర్య నిర్మితి లేదా ప్రేరకం తారుమారు అంటారు.
ఉదా- ఒక వ్యక్తి మీద లోపల ద్వేషం ఉన్నప్పటికీ పైకి ప్రేమగా నటించడం.
10. ఉపసంహరణ;- ఏదైనా ఒక విషయంలో లేదా పరిస్థితుల్లో పాల్గొన్నప్పుడు మన గెలవలేము అనే భావనతో ఆ పరిస్థితి నుండి పారిపోవడాన్ని ఉపసంహరణ అంటారు.
ఉదా- పిల్లవాడికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ పాల్గొన్న సరిగా రాయలేదని, బహుమతి పొందలేదని భయంతో పాల్గొనక పోవటం.
11. ఉదాత్తీకరణం:- సగ సభ్యత్వం కానీ ఆలోచనలను కోరికలను సంఘం ఆమోదించే రీతిలో వ్యక్తికరించడానికి ఉదాత్తీకరణం అంటారు.
ఉదా- ప్రేమలో ఫెయిల్ అయిన వ్యక్తి తాగ భావాలను ప్రేమ గీతాలు కవితలు వంటివి రాయడం ద్వారా నిర్మాణాత్మకమైన పనుల్లో నిమగ్నమై ఉపశమనం పొందడం.
ముగింపు;- ఈ విధంగా మనం సిగ్నెంట్ ఫ్రైడ్ గారు చెప్పిన ఎనిమిది రక్షక తంత్రాలతో పాటు మిగిలిన మూడు రక్షక పత్రాలు గురించి కూడా తెలుసుకున్నాము.. 99% గారు చెప్పిన వాటిలో నుండి నేను రావడం జరుగుతుంది,. ఎప్పుడైనా ఒకసారి మిగతా వాటిలో నుండి కూడా రావచ్చు.
TAGS
psychology classes in telugu
dsc psychology classes in telugu
tet psychology classes in telugu
psychologyclassesintelugu
telugupsychologyclasses
ap dsc psychology classes in telugu
telugupsychologyclass
psychology topic wise important bits in telugu
psychology rakshaka tantralu explain in telugu
tet rakshaka tantaru
rakshaka thantralu
tet psychology classes
best telu psychology classes
tet dsc psychology classes in telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: