Robotic Technologies In Agriculture || వ్యవసాయం చేసే రోబో || Farm Robo || But
Автор: But News Telugu
Загружено: 2025-02-11
Просмотров: 12573
#robots #farmingtechnology #robot #butnewstelugu
#AgriRobotics #AgriculturalAutomation #FarmingRobots #PrecisionAgriculture #AgTech #FarmBots #SmartFarming #AgriTech #RobotFarmers #AIinAgriculture #AgRobots #AgriDrones #RoboticsInFarming #SustainableAg #FarmTech #RoboticHarvesting #FarmingInnovation #AgriAI #AgriculturalDrones #AutonomousFarming
వ్యవసాయ పనులు చేస్తున్న రోబో.. రెండు రూపాయల ఖర్చుతోనే ఎకరంలో కలుపుతీత
సాగులో రైతులకు శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఒక రోబోను రూపకల్పన చేశారు ఫామ్ రోబో సంస్థ. బ్యాటరీతో ఈ రోబో పనిచేస్తుంది. ఒక యూనిట్ కరెంట్ తో.. చార్జ్ అవుతుంది. ఒక సారి చార్జ్ చేస్తే 3 నుండి 5 గంటల వరకు పనిచేస్తుంది.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. దుక్కి దున్నే దగ్గరి నుంచి పంట కోత వరకు యాంత్రీకరణతోనే వ్యవసాయం చేసే రోజులు వచ్చేశాయి. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని, అధిక దిగుబడిని సాధించడం వైపు నేటి ప్రపంచం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం ఓ కార్పొరేట్ సెక్టారుగా మారిపోయింది. ఇజ్రాయిల్, అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో వ్యవసాయ పనులు రోబోలు చక్కదిద్దుతున్నాయి. ఆ కోవలో కొత్తగా ఫాంరోబో సంస్థ వారు ఒక రోబోను తయారు చేశారు. ఇది ఏఏ పంటల్లో ఎలాంటి పనులు చేస్తుంది..? దీని ధర ఎంతో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే…
వ్యవసాయంలో రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు, చీడపీడలు . పంట ఏదైనా కలుపును తొలగించడానికి కూలీలకు అయ్యే ఖర్చు రైతుకు చాలా భారమవుతుంది. ఆ ఇబ్బందిని దూరం చేయాలనే ఉద్దేశంతో ఫామ్ రోబో సంస్థ రోబోను తయారుచేసింది. చిన్నపాటి ట్యాంక్ లా ఉండే ఈ రోబో వ్యవసాయంలో కలుపు తీయడం.. దుక్కి దున్నడం.. రసాయన మందులను పిచికారి చేయడం లాంటి పనులను అవలీలగా చేస్తుంది.
ఒక ఎకరంలో కలుపు తీయడానికి ఏడెనిమిది మంది కూలీల అవసరం. రసాయన మందుల పిచికారీ చేయడానికి, దుక్కి దున్నడానికి కలిపి సంవత్సరానికి ఖర్చు దాదాపు రూ. 20 వేల వరకు అవుతుంది. అందుకే సాగులో రైతులకు శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఒక రోబోను రూపకల్పన చేశారు ఫామ్ రోబో సంస్థ. బ్యాటరీతో ఈ రోబో పనిచేస్తుంది. ఒక యూనిట్ కరెంట్ తో.. చార్జ్ అవుతుంది. ఒక సారి చార్జ్ చేస్తే 3 నుండి 5 గంటల వరకు పనిచేస్తుంది. అంటే ఎకరం పొలంలో కలుపు తీయడానికి కరెంట్ ఖర్చు కేవలం ఒకటి నుండి రెండు రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ రోబో వల్ల రైతులకు ఆర్థికభారం చాలా తగ్గుతుంది అని ఆ సంస్ధ సభ్యులు చెబుతున్నారు.
ఆరుతడి పంటలకు సరిపడేలా ఈ పరికరాన్ని రూపొందించారు. కూలీలు లేకుండా అరచేతిలో రిమోట్ కంట్రోల్‌తో పంటపొలాల్లో ఈ కృత్రిమ రోబొ మిషన్‌తో అన్ని పనులూ చేయవచ్చు. నిర్ధిష్టమైన లోతు దుక్కులు , పొలంలో కలుపు మొక్కలను తొలగిస్తుంది. రసాయన మందుల పిచికారి చేస్తోంది. దీంతో అతి తక్కువ మోతాదులోనే రసాయనాల వినియోగం ఉంటుంది. ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాల్లో రైతుల పొలాల్లో డెమోని నిర్వహిస్తోంది ఆ సంస్థ. ఈ యంత్రం పనిపట్ల రైతులు సానుకూలంగానే ఉన్నా.. అధిక ఖర్చుతో కూడుకొని ఉండటంతో.. ప్రభుత్వం సబ్సిడీని కల్పించాలని కోరుతున్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: