Alasina Solasina Nee Padayatra Apanu | Ayyappa padayatra Song | Peddapuli eshwar | Kapil Madduri
Автор: JDL MUSIC
Загружено: 2021-11-02
Просмотров: 494030
SONG DETAILS :-
SONG NAME :- Alasina solasina nee padayatra apanu
LYRICS :- Kapil Madduri
SINGER :- peddapuli Eshwar
PRODUCER :- Dargupally Prabhakar , Sai kisohre yadav
MUSIC :- Akhilesh gogu
RECORDING :- Ag studios
EDITING : Sunny
SONG LYRICS :-
పల్లవి:-) అలసినా సొలసినా నీ పాదయాత్ర ఆపను
నా ప్రాణము నీ కోసము
పిలిచినా పలికినా నీ శరణు ఎపుడు మరవను
నిను చూడకుండ ఉండను
అను:-) ఎన్ని జన్మలైనా కొన శ్వాస చివరికైనా
అన్నీ నీవనుకున్నా నీ మాల వేసుకున్నా
నీ చల్లని దీవెనా నేను కోరుకున్నా....!
" అయ్యా నీ సేవ చేయ పుట్టినాను సత్యం
అయ్యప్పా నా తల్లి ఇచ్చినట్టీ జన్మ ధన్యం " ( 2 )
చ:-1) కష్టాలెన్నెదురైనా ఇష్టంగా నేనొస్తి
కన్నీళ్ళెన్నొచ్చిన చిరునవ్వుతో నే అడుగేస్తి
కన్నోళ్ళను అయినోళ్ళను వదిలి ఒంటరై వస్తీ
కట్టుకున్న ఆలి పిల్లల ప్రేమను కాదని వస్తీ
' నీవ్వే నాప్రాణము , నువ్వే నా గానము ( 2 )
అను:-) రాళ్ళముళ్ళ బాటా , నే నడిచె పూలతోటా
కళ్ళనీళ్ళగోసా , నా నోటా శరణుగోషా
తనవు తళ్ళడిళ్ళె నా మనసులోన నీవే....!
" అయ్యా నీ రూపు చూస్తే తొలుగు సర్వ పాపం
అయ్యప్పా నీ దరిశన భాగ్యాన్ని ఇస్తే పుణ్యం " ( 2 )
చ:-2) సద్బుద్దులు కలిగించి సద్గురువై దీవించి
అజ్ఞానపు చీకటులను అనిచి వెలుగునే నింపి
యద్బావం తత్ భవతని అద్బుత దైవంగా నిలిచి
విజ్ఞానపు బాటలోన నీ భక్తులను నడిపి
' నీ నామం తలిచెదా నీ రూపం కొలిచెదా ( 2 )
అను:-) ఐదుకొండలెక్కి వస్తున్నా నేను నడిచి
నిన్ను చూడ తలిచి కను రెప్ప ఆర్పకుంటి
కనులార కొలుచుకుంటీ మనసార వేడుకుంటీ...!
" అయ్యా శరణాలు అప్పజెప్పుకుంటా వస్తీ
అయ్యప్పా నువు నడిచిన అడుగుల్లో అడుగు వేస్తీ "(2)
చ:-3) ఆత్మ కల్మషాన్ని వీడి గురి తప్పని భక్తి పెంచి
నలబై ఒక్క దినము ధీక్ష నిష్టగా నే పాటిస్తి
కంటికి కనిపించనంతా దూరానా నువు నిలిచి
గుండె గూటిలోన నిండు నీ రూపాన్నే నిలిపి
' సర్వం శబరీషుడా , శ్రీ హరిహర పుత్రుడా ' ( 2 )
అను:-) పరితపించిపోతి నిను చూడాలనిపించి
నన్ను నేను మరిచి నీ నామ స్మరణ చేసి
కంఠా మణికంఠా జగమంతా నీవంటా....!
"అయ్యా నీ చెంత చేరే శక్తినియ్యవయ్యా
అయ్యప్పా నా భక్తి మెచ్చి ముక్తినియ్యవయ్యా " ( 2 )
___________________________________
#ayyappasongs2023
#2021Alasinasolasinaneepadayatraapanusong
#Sarvamshabarishavol5
#2021Newayyappasongs
#2021padayatrasongs
#peddapuliEshwar
#kapilmadduri
@JDL_MUSIC
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: