Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Sapta maharshulu,సప్త మహర్షులు, బ్రహ్మశ్రీ మైలవరపు లక్ష్మీ నరసింహం

Автор: TELUGU OM TV

Загружено: 2025-12-04

Просмотров: 663

Описание:

సప్త మహర్షులు

1. మరీచి, # అత్రి మహర్షి, # అంగిరసుడు, # పులస్త్యుడు, # పులహుడు, # క్రతువు, # వశిష్ఠుడు
రెండవదగు స్వారోచిషమన్వంతరములో వారు
• దత్తుడు *నిశ్చ్యవనుడు * స్తంబుడు * ప్రాణుడు * కశ్యపుడు * ఔర్యుడు * బృహస్పతి అను వారులు సప్తర్షులు.
మూడవదగు ఉత్తమ మన్వంతరములో
• కౌకురుండు * దాల్భ్యుడు * శంఖుడు * ప్రవహణుడు * శివుడు * స్మితుడు * సస్మితుడు అనువారులు సప్తర్షులు.
నాలుగవదగు తామస మన్వంతరములో
• కలి * పృధువు * అగ్ని * అకసి * కపి * జల్పుడు * ధీమంతుడు అనువారలు సప్తర్షులు.
అయిదవదగు రైవత మన్వంతరములో
• దేవబాహువు * సుబాహువు * పర్జన్యుడు * సోమపుడు * ముని * హిరణ్యరోముడు * సప్తాశ్వుడు అను వారలు సప్తర్షులు.
ఆరవదగు చాక్షుష మన్వంతరములో
• భృగువు * సుధాముడు * విరజుడు * సహిష్ణువు * నాధుడు * వివస్వానుడు * అతినాముడు అనువారలు సప్తర్షులు.
ఏడవదగు ప్రకృతమందు జరుగుచున్నది అగు వైవస్వత మన్వంతరములో
1. కశ్యపుడు
2. అత్రి
3. భరద్వాజుడు
4. విశ్వామిత్రుడు
5. గౌతముడు
6. వశిష్ఠుడు
7. జమదగ్ని
అనువారలు సప్తర్షులు.
కాని, జ్యోతిశ్శాస్త్రమునకును, పురాణమునకును ప్రకృతమందలి సప్తర్షి మండలములోని వారల పేర్లు విషయములో భేదము కనిపిస్తున్నది. ఇందుకు ప్రమాణము మహాభారతంలోని ప్రామాణిక శ్లోకం (శాంతిపర్వం 340-69,70)
మరీచిరంగిరాస్చాత్రిః పులస్త్యః పులహః క్రతుః
వశిష్ఠ ఇతి సప్తైతే మానసా నిర్మితాహి తే
ఏతే వేదవిదో ముఖ్యా వేదాచార్యాశ్చ కల్పితాః
ప్రవృత్తి ధర్మణశ్చైవ ప్రాజాపత్యే చ కల్పితాః
• మరీచి * అత్రి * అంగిరసుడు * పులస్త్యుడు * పులహుడు * క్రతువు * వశిష్ఠుడు ఈ పేర్లు మొదటిదగు స్వాయంభువు మన్వంతరము లోని సప్తర్షుల పేర్లతో సరిపడినవి.
అదియుకాక సప్తర్షుల పేర్లు వివిధ గ్రంథాలలో స్వల్పమార్పులతో కనుపిస్తాయి. "శతపథ బ్రాహ్మణము", "బృహదారణ్యకోపనిషత్తు" (2.2.4) లలో అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు సప్తర్షులని చెప్పబడింది. కృష్ణ యజుర్వేదం (సంధ్యావందన మంత్రం) లో అంగీరసుడు, అత్రి, భృగువు, గౌతముడు, కశ్యపుడు, కుత్సుడు, వశిష్ఠుడు సప్తర్షులని చెప్పబడింది.
సప్తర్షుల లక్షణాలు
సప్తర్షుల లక్షణాలు వాయు పురాణము (16-13,14) లో ఇలా చెప్పబడినవి - దీర్ఘాయువులు, వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ ఏడు గుణములు గల మహర్షులు "సప్తర్షులు"గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి, ధర్మ వ్యవస్థ సుప్రతిష్ఠమై సాగుచున్నది.
వీరి జీవన విధానము, భావములను వాయుపురాణంలో (61/95-97) ఇలా చెప్పారు.- అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞములు చేయుట, యజ్ఞములు చేయించుట, దానములను ఇచ్చుట, దానములు తీసికొనుట అనే ఈ ఆరు కర్మలను నిత్యము ఆచరించేవారు, విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు, సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమమును స్వీకరించిన వారు, అగ్నికార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యవహారములను నడిపేవారు, స్వయముగా సంపాదించుకొనిన అనింద్య భోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానము గలిగి గోధనాది సంపదలచే ఒప్పువారు, ప్రాపంచిక విషయాలపట్ల నిరాసక్తులు.
మరీచి
ఇతడు భగవంతుని అంశావతారము అంటారు. ఇతనికి అనేకమంది భార్యలున్నారు. వారిలో "సంభూతి" అనే ఆమె ముఖ్యురాలు. ఆమె దక్ష ప్రజాపతికి అతని భార్య ధర్మవ్రత యందు జన్మించింది. మరీచి మహర్షి అధిక సంతానవంతుడు. కశ్యప మహర్షి ఈయన కుమారుడే.
అంగిరసుడు
ఇతడు అసాధారణ ఆధ్యాత్మిక తేజో సంపన్నుడు. ఇతనికి పెక్కురు భార్యలున్నారు. వారిలో ముఖ్యులు సురూప (మరీచి కుమార్తె), స్వరాట్టు (కర్దముని కూతురు), పథ్య (మను పుత్రిక). సురూపకు బృహస్పతి (కొన్ని చోట్ల శుభ అనే భార్యయందు అని ఉంది), స్వరాట్టుకు గౌతముడు, వామదేవుడు మొదలగు ఐదుగురు పుత్రులు, పథ్యకు విష్ణు మొదలగు మువ్వురు పుత్రులు జన్మించారు. అగ్ని పుత్రిక యైన ఆత్రేయ యందు అంగిరసులు జన్మించారు.
అత్రి
ఇతను దక్షిణ దిశకు చెందినవాడు. మహాపతివ్రతయైన అనసూయ (కర్దముడు, దేవహూతుల కూతురు, కపిలుని చెల్లెలు) ఇతని ధర్మపత్ని. సీతారాములుతమ వనవాస కాలంలో అనసూయ, అత్రిల ఆతిథ్యం స్వీకరించారు. ఈ దంపతులకు త్రిమూర్తుల అంశతో ముగ్గురు పుత్రులు - దత్తాత్రేయుడు, చంద్రుడు, దుర్వాసుడు - జన్మించారు.
పులస్త్యుడు
ఇతడు మహాధర్మపరుడు, తపస్వి, తేజస్వి, యోగశాస్త్ర నిష్ణాతుడు. ఒకమాఱు పులస్త్యుని అభ్యర్థన మేరకు పరాశరుడు రాక్షస సంహారార్థం చేసే యాగం ఆపేశాడు. అందుకు ప్రసన్నుడై పులస్త్యుడు పరాశరుని సకల శాస్త్రప్రవీణునిగా చేశాడు. పులస్త్యుని భార్యలు సంధ్య, ప్రతీచి, ప్రీతి, హవిర్భువు. దత్తోలి, నిదాఘుడు, విశ్వ వసు బ్రహ్మ మొదలగువారు పులస్త్యుని కుమారులు. దత్తోలి అగస్త్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనువారు విశ్రవసు బ్రహ్మ కుమారులు. (కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు విశ్రవసుని కుమారులని ఆంటారు. ఒకసారి సరిచూడవలసినది)
పులహుడు
ఇతడు మహా ప్రభావశాలి, జ్ఞాని. సనందన మహర్షి వద్ద దివ్యజ్ఞానము పొంది, దానిని గౌతమునికి అందించెను. దక్ష ప్రజాపతి కుమార్తె క్షమ, కర్దముని కుమార్తె గతి అనువారు పులహుని భార్యలు.
క్రతువు
ఇతడు గొప్ప ఆధ్యాత్మిక తేజస్సంపన్నుడు. కర్దముని పుత్రిక క్రియ, దక్షుని పుత్రిక సన్నతి ఇతని భార్యలు. ఇతని వలన వాలఖిల్యులు అని పేరు పొందిన 60 వేల మంది ఋషులు జన్మించారు. వీరు సూర్యుని రథమునకు అభిముఖంగా నడచుచుందురు.
వశిష్ఠుడు
ఇతడు సూర్యవంశ ప్రభువుల పురోహితుడు. అష్టసిద్ధులు గలవాడు. సనాతన ధర్మమునెరిగినవారిలో ముఖ్యుడు. మహాసాధ్వి అరుంధతి ఇతని ధర్మపత్ని. వసిష్ఠుడు శ్రీరామునకు బోధించిన తత్వజ్ఞాననము యోగవాశిష్ఠము అని ప్రసిద్ధి పొందినది.

Sapta maharshulu,సప్త మహర్షులు, బ్రహ్మశ్రీ మైలవరపు లక్ష్మీ నరసింహం

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ముల్లోకాలను కూడా శాసించే మంత్రం.. || Sri Ramyananda Bharati Swamini || Anchor Maa Sharma

ముల్లోకాలను కూడా శాసించే మంత్రం.. || Sri Ramyananda Bharati Swamini || Anchor Maa Sharma

МОЖНО БОЛЬШЕ НЕ БОЯТЬСЯ БУДУЩЕГО Разум молодежи другой ТАТЬЯНА ЧЕРНИГОВСКАЯ

МОЖНО БОЛЬШЕ НЕ БОЯТЬСЯ БУДУЩЕГО Разум молодежи другой ТАТЬЯНА ЧЕРНИГОВСКАЯ

БЕХТЕРЕВА О КОДАХ ГАРЯЕВА. СЛОВО, КОТОРОЕ СПОСОБНО ВЛИЯТЬ НА ДНК. ВЕЛИКАЯ ТАЙНА МОЗГА

БЕХТЕРЕВА О КОДАХ ГАРЯЕВА. СЛОВО, КОТОРОЕ СПОСОБНО ВЛИЯТЬ НА ДНК. ВЕЛИКАЯ ТАЙНА МОЗГА

వేదాలలో చంద్రుడి దివ్యతేజస్సు | అద్భుత రహస్యం వివరించిన ప్రామాణిక వేదవిజ్ఞానం!

వేదాలలో చంద్రుడి దివ్యతేజస్సు | అద్భుత రహస్యం వివరించిన ప్రామాణిక వేదవిజ్ఞానం!

తారాబలం చూడడం ఎలా#astrology#ఒక్కసేకన్ లో తారాబలం చూడడం మీకు తెలుసా.#

తారాబలం చూడడం ఎలా#astrology#ఒక్కసేకన్ లో తారాబలం చూడడం మీకు తెలుసా.#

Part - 2 Sri Dattatreya Charitra | Guru Charitam | Markandeya Puranam | By Vaddiparti Padmakar Garu

Part - 2 Sri Dattatreya Charitra | Guru Charitam | Markandeya Puranam | By Vaddiparti Padmakar Garu

Почему мы болеем? Иммунодиетолог о том, как питание влияет на здоровье | Марина Внукова

Почему мы болеем? Иммунодиетолог о том, как питание влияет на здоровье | Марина Внукова

Skanda Sashti సుబ్రహ్మణ్య షష్ఠి Subrahmanya Shashti, శ్రీమతి వేదాంతం విష్ణు ప్రియ

Skanda Sashti సుబ్రహ్మణ్య షష్ఠి Subrahmanya Shashti, శ్రీమతి వేదాంతం విష్ణు ప్రియ

КОЗЫРЕВ - астрофизик ДОКАЗАЛ, что ВРЕМЯ это ЭНЕРГИЯ: дважды СИДЕЛ, приговорён к РАССТРЕЛУ

КОЗЫРЕВ - астрофизик ДОКАЗАЛ, что ВРЕМЯ это ЭНЕРГИЯ: дважды СИДЕЛ, приговорён к РАССТРЕЛУ

యోగ అంటే తెలియని నేను, ఆరు నెలల్లోనే, క్రియాయోగ చేస్తున్న అని చెప్పిన సాధకుడు

యోగ అంటే తెలియని నేను, ఆరు నెలల్లోనే, క్రియాయోగ చేస్తున్న అని చెప్పిన సాధకుడు

КЛАССИЧЕСКАЯ МУЗЫКА ДЛЯ ВОССТАНОВЛЕНИЯ НЕРВНОЙ СИСТЕМЫ🌿 Нежная музыка успокаивает нервную систему 22

КЛАССИЧЕСКАЯ МУЗЫКА ДЛЯ ВОССТАНОВЛЕНИЯ НЕРВНОЙ СИСТЕМЫ🌿 Нежная музыка успокаивает нервную систему 22

Эти ЗНАНИЯ  Сэкономят Вам Года ЖИЗНИ Татьяна Черниговская

Эти ЗНАНИЯ Сэкономят Вам Года ЖИЗНИ Татьяна Черниговская

41 రోజులు హనుమాన్ చాలీసా చదివితే.! | Santh Sadananda Giri About Hanuman Chalisa Importance | iDream

41 రోజులు హనుమాన్ చాలీసా చదివితే.! | Santh Sadananda Giri About Hanuman Chalisa Importance | iDream

Yaksha Prashnalu - Answers Story | యక్ష ప్రశ్నలు-సమాధానాలు కథ | Mahabharatam | Brahmasri Vaddiparti

Yaksha Prashnalu - Answers Story | యక్ష ప్రశ్నలు-సమాధానాలు కథ | Mahabharatam | Brahmasri Vaddiparti

ధర్మ రహస్యాలపై: వేదము మాత్రమే పరమ ప్రమాణము ఎందుకు? సనాతన ధర్మ సారము!

ధర్మ రహస్యాలపై: వేదము మాత్రమే పరమ ప్రమాణము ఎందుకు? సనాతన ధర్మ సారము!

శుక్రవారం స్పెషల్: శ్రీ మహాలక్ష్మీ పాటలు | Friday Special Laxmi Devi Songs Telugu | #laxmisongs

శుక్రవారం స్పెషల్: శ్రీ మహాలక్ష్మీ పాటలు | Friday Special Laxmi Devi Songs Telugu | #laxmisongs

‘కలామ సుత్త’, సరైన ఆలోచనల కోసం బుద్ధుడు చెప్పిన సూత్రాలు || 'Kalama Sutta' In Buddhist Teachings? ||

‘కలామ సుత్త’, సరైన ఆలోచనల కోసం బుద్ధుడు చెప్పిన సూత్రాలు || 'Kalama Sutta' In Buddhist Teachings? ||

యోగి జి కి ఫ్యాన్ అయిపోనా రాష్ట్రపతి పుతిన్ | పుతిన్ తో యోగి చేసుకున్న రహస్యమైన డీల్ | FN-20 Telugu

యోగి జి కి ఫ్యాన్ అయిపోనా రాష్ట్రపతి పుతిన్ | పుతిన్ తో యోగి చేసుకున్న రహస్యమైన డీల్ | FN-20 Telugu

Margasira guruvar vratham మార్గశిర గురువార వ్రతం, శ్రీమతి వేదాంతం విష్ణు ప్రియ

Margasira guruvar vratham మార్గశిర గురువార వ్రతం, శ్రీమతి వేదాంతం విష్ణు ప్రియ

Swami Vidya Prakashananda Giri AI Video | Swami Vidya Prakashananda Latest

Swami Vidya Prakashananda Giri AI Video | Swami Vidya Prakashananda Latest

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]