కార్యకర్తలకు అండగా ఉంటా
Автор: Telangana Voice
Загружено: 21 апр. 2025 г.
Просмотров: 955 просмотров
BIG BREAKING
భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ గారికి, పార్టీ కార్యకర్తలకు వారిధిగా ఉంటాను నేను
కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి నేను తీసుకెళ్తాను
ఏ చిన్న అవసరమున్నా నన్ను కార్యకర్తలు సంప్రదించవచ్చు
కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావిస్తాను
తెలంగాణను కాపాడడమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రథమ కర్తవ్యం
కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు తేలేదు
ఆత్మీయ భరోసా కింద నిరుపేదలకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్
మన కళ్ల ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది
అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విపరీతమైన అబద్దాలు చెబుతున్నారు
2004లో చచ్చిన పీనుగలా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది
2004లోనే తెలంగాణ ఇచ్చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పదేళ్లు ప్రజలను ఏడిపించింది
వందలాది మంది బిడ్డలను పొట్టనపెట్టుకొని తెలంగాణ ఇచ్చారు తప్పా ఉట్టిగా ఇవ్వలేదు
లక్షా 60 వేల కోట్లుపైగా అప్పు తెచ్చిన సర్కారును ప్రశ్నిస్తే బుకాయిస్తున్నారు
తెచ్చిన రుణాన్ని ఏం చేశారని అడిగితే చెప్పబోమని చెబుతున్నారు
తెచ్చిన అప్పులను ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను
40 వేల కోట్ల విలువైన భూములను 10 వేల కోట్లకు ప్రభుత్వం తాకట్టు పెట్టింది
ఆ 10 వేల కోట్లతో రైతు భరోసా, రుణ మాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారు
కానీ ఇప్పటికీ 60 శాతం మందికి రుణ మాఫీ కాలేదు, 50 శాతం మందికి రైతు భరోసా రాలేదు
మరి ఈ 10 వేల కోట్లు ఎక్కడ పోయినట్లు ?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలి
ప్రస్తుత పాలకులు చూడడానికి తెలంగాణ వ్యక్తుల్లా ఉంటారు... కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా
కాంగ్రెస్ పార్టీ అనేక కల్లిబొల్లి మాటలు చెప్పింది.. లేనిపోని హామీ ఇచ్చింది
అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు
అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టిన ఘనత కేసీఆర్ ది
రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా కేసీఆర్ పని చేశారు
సీతారామ ప్రాజెక్టును నిర్మించి 3.5 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు అందించారు
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష
తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఖమ్మం జిల్లా నుంచి
1969లో ఖమ్మంలో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రమంతా పాకింది
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ద్రోహి
భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే గెలుపు బీఆర్ఎస్ పార్టీదే
అలాంటి ద్రోహులను చాలా చూశాం... కుట్రలను చూశాం
బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమరపాటుగా ఉంటే కచ్చితంగా కాంగ్రెస్ తెలంగాణను ఆగం చేస్తుంది
మోసపోతే గోస పడుతారని కేసీఆర్ పదే పదే అన్నారు
మోసం చేయడం కాంగ్రెస్ నైజం
#kcr #ktr #telangana #revanthreddy #harishrao #25yearsofbrs #brsat25 #kalvakuntlakavitha

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: