చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి
Автор: @samstalk
Загружено: 2025-07-26
Просмотров: 42
చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఇద్దరూ ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్‌రావు(57), శాంతారావు(54)గా గుర్తించారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న స్కార్పియో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. రోడ్డు అవతలివైపు పడింది. అటుగా వస్తున్న లారీ.. స్కార్పియోను ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృత దేహాలను బయటకు తీశారు. మృతులిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదంలో ఏఎస్పీ కోకా రామ్ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి.

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: