దేవీ విరాడ్రూప వైనట్టి నీకు | Devi Viradrupamainatti Neeku | 2022 Navratri Song | Dasara Latest song
Автор: Karthikeya Music Productions
Загружено: 2021-10-10
Просмотров: 24361
A peaceful and devotional bhakti song of Goddess Durga Devi. A must listen from Karthikeya Music Productions
Composition of Parama Pujya Sri Ganapathy Sachchidananda Swamiji
Music: Vijay Krishna
Singing: Sai Suma, Sai Manogna
Veena: Phaninarayana
/ phaninarayana
Indian Rhythms: Anil Robin
దేవీ విరాడ్రూప వైనట్టి నీకు | Devi Viradrupamainatti Neeku | 2022 Navratri Song | Dasara Latest song
దేవీ..దేవీ..
దేవీ విరాడ్రూపవైనట్టి నీకు
ప్రకృతి సర్వమ్ము ముస్తాబు చేయు ||2||
1. ఉదయించు రవి కాళ్ళ పారాణి పెట్టు
శశిలోని కరిమచ్చ కస్తూరి బొట్టు ||2||
మధ్యాహ్న రవి మకుట కోటీరమూ
నక్షత్రతటి రత్న భూషావళి ||2||
దేవీ..దేవీ..
దేవీ విరాడ్రూపవైనట్టి నీకు
ప్రకృతి సర్వమ్ము ముస్తాబు చేయు
2. తుదలందు వెన్నెలల వెలుగీనెడి
మబ్బుల్లు వయ్యారి పైటంచులు ||2||
వర్షాలు మెడలోని ముత్యాల సరులు
చీకట్లు నాట్యాన చెలరేగు కురులు ||2||
దేవీ..దేవీ..
దేవీ విరాడ్రూపవైనట్టి నీకు
ప్రకృతి సర్వమ్ము ముస్తాబు చేయు
3. మానవులు అందెల్లో చిరుగజ్జెలు -2
పక్షులు వడ్డాణమున గంటలు -2
దేవతలు అందాల భుజకీర్తులు -2
సురగంగ మాంగళ్య గళసూత్రము -2
దేవీ..దేవీ..
దేవీ విరాడ్రూపవైనట్టి నీకు
ప్రకృతి సర్వమ్ము ముస్తాబు చేయు
4. నిన్ను ఈ రీతి భావించి వీక్షించినా
సచ్చిదానంద భావమ్ము రాకుండునా ||2||
దేవీ..దేవీ..
దేవీ విరాడ్రూపవైనట్టి నీకు
ప్రకృతి సర్వమ్ము ముస్తాబు చేయు ||2||
#dasara #Navratri #Durga #devotionalsongs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: