గోదాదేవి శుభ చరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకల్పం శ్రవణజీవనం ముక్తిపదం అంటూ....గోదా చాలీసా
Автор: Suhasini Chigullapally
Загружено: 2026-01-11
Просмотров: 16
శ్రీ గోదాదేవ్యై నమః
శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం
గోదా చాలీసా
గోదాదేవి శుభ చరితం మహిమాన్విత సుధాభరితం
అతులిత పావన సంకల్పం శ్రవణజీవనం ముక్తిపదం..శ్రవణ జీవనం ముక్తి పదం..
గోదాదేవి విరచితం ముప్పది పాశుర ప్రబంధం...
గోదాదేవి వందనం ధరణి పుత్రిక వందనం
శ్రీ రంగనాయకి వందనం మంగళ దీపిక వందనం మానవ కన్యక జనియించి విగ్రహరూపుని వరించి శ్రీరంగనాధుని పతిగా నెంచి అపూర్వ చరితను సృష్టించే..గోదాదేవి విరచితము ముప్పదిపాసుర ప్రబంధముపవిత్ర వ్రతమును ఒనరించి యెల్లజలునకు హితమును పంచె భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే ఎదురుగా ఉన్న విగ్రహ మూర్తిని నిజమూర్తిగా తను భావించి అనుపమానము అసమానమునగు దైవ ప్రభావం దర్శించే..
గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధము
విగ్రహ మూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం
గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం వులకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొల్పినది
పిల్లవానిగా మనసున్న తలచి స్వామికి బోధన చేసినది
గోదాదేవివిరచితము ముప్పదిపాసుర ప్రబంధము
మనుజుల మేలును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీ రంగనాయకులు ఆండాలమ్మను వరించెను శ్రీవిల్లి పుత్తూరు నందు అవతార మూర్తి శ్రీకృష్ణుడు వటపత్రము పై శయనించి లోక రక్షణము కావించే గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధంఆ శ్రీ విల్లి పుత్తూరు నందు బట్టనాధుడను విప్రుండు వసించె నిరతము విష్ణుచింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా.. విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా గూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను.. గోదాదేవి విరచితము ముప్పది పాశుర ప్రబంధమువిష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి చెందిన
ఆళ్వార్లుగా కీర్తించి పెరియాళవారుగా బిరుదుము నొసగిరి పెరియాల్వార్లు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలు గారి చిన్నారి పాపను..
గోదాదేవి విరచితము ముప్పది పాశుర ప్రబంధము
అచట దొరికిన చిన్న పాపను దైవప్రసాదముగా భావించి కోదై నామముతో గారాభముగా పెంచసాగాను.
కోదై అనగా పూలమాల కోదై నామమే కాలక్రమమున గోదాదేవిగా మార్పును చెంది ఆ విధముగా ప్రసిద్ధి చెందే..గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధం
చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించే
కృష్ణ లీలలను ఎల్లప్పుడూ ఆడుతు పాడుతు గడుపుచుండెను యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారెను కళ్ళు మూసినా కళ్ళు తెరచినా నల్లని వానినే గాంచ సాగెను..
గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధం.. 🙏🏻
విల్లి పుత్తూరు గోకులముగా తన స్నేహితులను గోపికలుగా అన్నివేళలా భావన చేసి ఆవిధంబుగా చరించ సాగే విష్ణుచిత్తుడు భగవంతుని కై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను గోదా దేవి విరచితము ముప్పది పాశుర ప్రబంధము.ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమునందు కన్నుల గాంచిజరిగినది అపచారం అని తలచి ఎంతయి చింతించే..కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే గోదా ధరించు పూల మాలలు ప్రీతిపాత్రమని వివరించే గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రభంధము వివరము ఎరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెలను కలుపుకొని కాత్యాయన వ్రతమాచరించే ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమాలుగోదాదేవి పాటించి పాసురములుగా వివరించే..గోదాదేవి విరచితము ముప్పదిపాసుర ప్రబంధము వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగ వినిపించే గీతములే ఈ పాసురమ్ములు,ఉపనిషత్తుల సారములు.అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడుకొని రమ్మని వివరించే గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధము శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయము.నిర్ణయమును ఎరిగించ అందరు ఆనందము పొందిరటసకల పురజనులు వెంటను రాగా అర్చకులు అందరి తోడుగా రాగా గోదాదేవిని తోడుకొని వెళ్లి ఆలయమoదున ప్రవేశమైనది గోదాదేవి విరచితము ముప్పది పాశుర ప్రబంధము పెళ్లికూతురుగా గర్భగుడినందు ప్రవేశించిన గోదాదేవి ఎల్లజనులను చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యేనుశ్రీవిల్లి పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగారంగనాథుడు వలచిన పిదప తాను కలిసేను ఉత్సవమూర్తిగా గోదాదేవి విరచితము ముప్పదిపాసుర ప్రబంధము అవతార మూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీ రంగనాథుడు శ్రీరంగనాధుని పరిణయమాడి గోదాదేవి ఇలవేల్పయ్యను. నాటినుండి ప్రతి వైష్ణవాలయమున భోగినాడు గోదాదేవికి. విష్ణుమూర్తితో కళ్యాణం జరిపించుట ఒకసాంప్రదాయం..
గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధం..
ధనుర్మాసమున తొలిమలి సంధ్య ల దీపారాధన చేయుట వలనలక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము సకల సంపదల సిద్ధి తద్యము తిరుప్పావైని సుప్రభాతముగా ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలకు బాలలకు ఇచ్చుట సాంప్రదాయం..
గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధము
దేవతలకు ఇది బ్రాహ్మీ ముహూర్తం మకర కర్కాటక సంక్రాంతిలలో పూజలు చేయుట శుభకరము భక్తజనులకు ఒక వరం ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా.ధనుర్మాస వ్రతమాచరించటం వైష్ణవ భక్తుల మోదనము..
గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధం
మొదటి పక్షమున చక్కెర పొంగలి రెండవ పక్షము దద్దోజనం నైవేద్యముగా మధుసూదననికి సమర్పించడం దివ్య భోగము భూదేవి అవతారమైన ఆండాలమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తి ప్రదం.గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధం అనునిత్యమును బ్రహ్మ ముహూర్తమున శుభ గడియలలో తిరుప్పావై పారాయణం దివ్య వరము దైవానుగ్రహ సంప్రాప్తం ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలపీ పసుపు కుంకుమలతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణ యోగం గోదాదేవి విరచితము ముప్పదిపాసుర ప్రబంధము ధనుర్మాసమున ఆండాళ్ పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మము ధన్యము శుభయోగం మన జన్మము ధన్యముశుభయోగం మన జన్మము ధన్యము శుభయోగంగోదాదేవి వందనం ధరణి పుత్రిక వందన. శ్రీ రంగనాయకి వందనం మంగళ దీపిక వందనము గోదాదేవి శుభ చరితం మహిమాన్విత సుధాభరితం
అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తి పదం, మన శ్రవణ జీవనం ముక్తిప్రదం..గోదాదేవి విరచితము
ముప్పది పాశుర ప్రబంధము..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: