లలితభావ నిలయ- రహస్యం (1967)సినిమా. గానం ఘంటసాల,బృందం.రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి , సంగీతం ఘంటసాల
Автор: SAHITHI VIDEOS
Загружено: 2021-07-31
Просмотров: 116420
1967లో విడుదలైన రహస్యం సినిమా కి సంగీత దర్శకత్వం ఘంటసాలగారు. లలితాదేవిని స్తుతించే సన్నివేశానికి రామకృష్ణశాస్త్రిగారు రచించిన గీతాన్ని రాగమాలికలో స్వరపరిచారు ఘంటసాలగారు. ముగురమ్మల మూలపుటమ్మ, జగదంబ అయిన అమ్మవారి వైభవాన్ని లక్ష్మి, పార్వతి, సరస్వతుల కలయికగా వర్ణిస్తూ, నారదుడు, ఇతర దివ్యాంగనామణులతో కలిసి స్తుతించే సన్నివేశానికి రాసిన పాట ఇది. పల్లవిలో లలితాదేవిని, మొదటి చరణంలో సరస్వతీ దేవిని స్తుతించారు. రెండు, మూడు చరణాలలో లక్ష్మీ దేవి, పార్వతీ దేవిని స్తుతించారు. ఘంటసాల ఈ పాటను సరస్వతిరాగం, శ్రీరాగం, సరస్వతిరాగం, లలిత రాగాల సమ్మేళనంతో రాగమాలికగా తీర్చి దిద్దారు. లలితభావ నిలయను సరస్వతి రాగంలో, శ్రీదేవి కైవల్య చింతామణిని శ్రీ రాగంలో, నిటలలోచన నయన తార తారా భువనేశ్వరిని లలిత రాగంలో స్వరపరచడం ఈ పాటలోని విశేషం.
పల్లవి లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయన.. సదయ జగదీశ్వరీ
‘
చరణం 1. మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
సుమరదన విధువదన.. దేవి
అంబరాంతరంగ శారదా స్వరూపిణీ. చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే
చరణం 2: శ్రీదేవి కైవల్య చింతామణి… శ్రీరాగ మోదిని చిద్రూపిని
బింబాధరా.. రవిబింబాంతరా..
రాజీవ రాజీవిలోలా… రాజీవ రాజీవిలోల
శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని….
చరణం 3: నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
అరుణవసన.. అమలహసనా
మాడినీ.. మనోన్మణి
నాదబిందు కళాధరీ భ్రామరీ…
నాదబిందు కళాధరీ భ్రామరీ… పరమేశ్వరీ
‘
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: