Bagavan Sri Venkaya Swami Songs - ఓం నారాయణ - అది నారాయణ - 11
Автор: Hindus Philosophy
Загружено: 2022-09-30
Просмотров: 22160
Playlist Link- https://bit.ly/3nNgn5H #venkayaswami #VenkaiahSwamy #venkayaswamisongs #bhajanalu #geethalu #jukebox
#devotionalsongs #devotionalvideos #devotionalmovies Recorded Year: 01/01/1995
1) ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా.
2) వాళ్ళుండే దాన్నిబట్టి గదయ్యా మనముండేది.
3) అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో.
4) అందరికీ పంట పండించాను. దాన్ని దొంగలుపడి దోచుకోకుండా చూసుకోండయ్యా.
5) ఒకరిని పొమ్మనేదాన్ని కంటే మనమే పోవటం మంచిదయ్యా.
6) సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప.
7) వెయ్యి గొర్రెలలో ఉన్నా, మన గొర్రెను కాలు పట్టి లాక్కు రావచ్చు.
8) మంత్ర మెక్కడుంది? తంత్రమెక్కడుంది? చూచుకొంటూ పొయ్యేది గదయ్యా.
9) సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడ కొచ్చి ఏదనుకొంటే అదయ్యేదే గదయ్యా.
10) నీవు నన్ను విడిచినా, నేను నిన్ను విడువను.
11) మహారాజుని చూస్తే ఏమొస్తుంది? నీ కేముందో అదే నీకు మిగులు కదయ్యా.
12) అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు, నీవు దేవుడిని చూడగలవు కదయ్యా.
13) నా ఎడల నీ విశ్వాసమే నన్ను కదిలిస్తుంది కదయ్యా.
14) కూలివానికి, అతని చెమటారకముందే, కూలి ఇవ్వటం మంచిది కదయ్యా.
15) ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా.
16) పావలా దొంగిలిస్తే, పదిరూకల నష్టం వస్తుంది గదయ్యా.
17) లాభం కోసం కక్కుర్తి పడితే, ఆ పాపంలో భాగం పంచుకోవాలి గదయ్యా.
18) దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా.
19) అత్యాశ వదులుకుంటే, అన్నీ వదులుకున్నట్లే.
20) మర్యాదలు పాటిస్తూ, సాధారణ జీవితం గడుపుతూ, సద్గురులకు సేవ చెయ్యటం నేర్చుకోవటం మంచిది గదయ్యా.
గొలగమూడి వెంకయ్య స్వామి మందిర వేళలు:
ఉదయం
4.00 గం|| : సమాధి మందిరం తెరువబడును
4.30 గం|| : అభిషేకం
5.00 గం|| : ఉదయం పూజ
11.00 గం|| : మధ్యాహ్న పూజ
2.00 గం|| : విరామం (సమాధి మందిరం మూయబడును)
సాయంత్రం
4.00 గం|| : సమాధి మందిరం మరలా తెరువబడును
6.30 గం|| : సాయం పూజ
8.45 గం|| : రాత్రి ఆరతి
9.00 గం|| : సమాధి మందిరం మూయబడును**
**శనివారం నాడు మాత్రం రాత్రంతా మందిరం తెరిచే ఉండును.
శనివారం మరియు గురువారం, రాత్రి 8.00 గం|| : పల్లకి సేవ జరుగును (మొదటిసారి వెళ్తుంటే తప్పక చూడండి).
శనివారం మరియు గురువారం, రాత్రుళ్ళు మందిరంలో నిద్ర చేయుటకు భక్తులకు అనుమతి కలదు.
చూడవలసిన ప్రదేశాలు
1. శ్రీ స్వామి వారి సమాధి మందిరం
2. శ్రీ స్వామి వారి ధుని
3. శ్రీ స్వామి వారి సేవకుల సమాధులు (ఇవన్నీ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి)
4. శ్రీ స్వామి వారి కుటీరం (సమాధి మందిరం ఎదురుగా ఉన్నది)
స్వామి వారి ధుని (అగ్నిగుండం)
అదృష్టం కొద్దీ, గొలగమూడిలో మన చేతులతో మనమే స్వయంగా ధునిలో కొబ్బరికాయలు, కట్టెపుల్లలు, నెయ్యి, సాంబ్రాణి, అగరువత్తులు, కర్పూరం, నవధాన్యాలు మొదలగునవి సమర్పించవచ్చు. కొబ్బరికాయలు, కర్పూరం మొ|| పూజాసామగ్రి మందిరం ఎదురుగా ఉన్న అంగళ్ళలో దొరుకును. నవధాన్యాలు, నెయ్యి అదే వీధిలో ఉన్న కిరాణా కొట్టుల్లో దొరుకును. మన ఇంటి వద్ద నుండి కూడా బియ్యం మొదలైనవి నామస్మరణ చేస్తూ తీసుకువచ్చి మన చేతులతొ మనమే స్వయంగా ధునిలో సమర్పించవచ్చు. రద్దీ లేనప్పుడు ధునికి ప్రదక్షిణలు చేయవచ్చును. శనివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు స్వామివారి కుటీరంలో ప్రదక్షిణలు చేయవచ్చు.
స్వామి వారి దారం
స్వామివారి పవిత్ర దారం స్వామివారి కుటీరంలో ఇవ్వబడుతుంది. ఒకవేళ భవిషత్తు అవసరాలకు దాచుకోటానికో మన స్నేహితులు, బంధువుల కోసమో ఎక్కువగా దారం కావాలంటే మనమే ఒక దారపు ఉండకొని సమాధి మందిరంలో దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారిని అడిగితే, ఆ దారపు ఉండని సమాధికి తాకించి తిరిగి మనకి ఇస్తారు.
Playlist Link- https://bit.ly/3nNgn5H
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: