CM Revanth Reddy: Kodangal will be a Model Constituency by 2034 | Kodangal as Telangana’s Noida
Автор: Telangana CMO
Загружено: 2025-11-24
Просмотров: 22389
Hon'ble Chief Minister Shri A. Revanth Reddy emphasized making Kodangal an ideal assembly constituency in the country by 2034. He said that this constituency, which has been neglected for the past 70 years, now has a historic opportunity to develop into a model constituency that people from across the country can visit and witness.
🔹 The Chief Minister visited Kodangal today, inspected the modern breakfast kitchen of Hare Krishna Sanstha (HKM), and participated in the groundbreaking ceremony for the mid-day meal kitchen under the Akshaya Patra Foundation. The foundation stone for development projects worth Rs. 103 crore was laid, and cheques and sarees were distributed to beneficiaries.
🔹 Welfare schemes for girls, focusing on education and security, are being implemented, alongside irrigation projects to transform Kodangal into a model constituency. Breakfast is provided to 28,000 students in 312 schools, with a mid-day meal scheme also being introduced.
🔹 Kodangal is being developed as an educational hub with plans for medical, veterinary, agricultural, engineering, and para-medical colleges, a Sainik school, and a Rs. 5,000 crore education campus aimed at attracting students nationwide within 16 months.
🔹 Drought-prone areas will receive Krishna River water through a lift irrigation project costing Rs. 5,000 crore. About 95% of farmers have voluntarily provided land for industrial and infrastructure projects, including Lagacharla industrial estate.
🔹 Kodangal is positioned as a major industrial hub, with railway connectivity approved to Karnataka and a cement industry to generate employment.
🔹 One crore quality sarees are being distributed to women, and self-help groups received interest-free loans worth Rs. 300 crore. Earlier, the Chief Minister flagged off a bus run by Maddur Mandal Mahila Samakhya under the Mahila Shakti scheme. Ministers, officials, and women’s organizations participated in large numbers.
2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా నిలబెడుదామని చెప్పారు.
❇️ ముఖ్యమంత్రి గారు ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. కొడంగల్‌లో హరేకృష్ణ సంస్థ (HKM) వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) ను పరిశీలించారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ (Akshaya Patra Foundation) ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు.
❇️ ఇదే సందర్భంగా నియోజకవర్గంలో రూ. 103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.
❇️ "ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుంది. అభివృద్ధికి కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నాం.
❇️ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుకుంటున్న 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం పెడుతున్నాం. మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెడుతున్నాం. కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చుతున్నాం.
❇️ కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్, మక్తల్, నారాయణపేటలో ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించాం.
❇️ లగచర్ల, హకీంపేట, పోలెపల్లి ప్రాంతంలో రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను స్థాపించి లగచర్ల పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తున్నాం.
❇️ కొడంగల్ ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా, దేశ రాజధాని ఢిల్లీ పక్కన నొయిడా అభివృద్ధి చెందినట్టుగా, తెలంగాణ నొయిడాగా తీర్చిదిద్ది కొడంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం.
❇️ 70 ఏండ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే లైను పనులు తొందరలోనే మొదలుపెట్టబోతున్నాం.
❇️ గ్రామాల్లో బడి, గుడి, తాగడానికి మంచినీరు, ఇందిరమ్మ ఇండ్లు.. కావాలి. ఇలాంటి పనులు చేయాలంటే రాబోయే సర్పంచు ఎన్నికల్లో మంచి వారిని గెలిపించుకోవాలి.." అని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.
❇️ ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, వాకిటి శ్రీహరి గారు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
#Telangana #CMRevanthReddy #Kodangal #KodangalDevelopment #PublicMeeting #AkshayaPatraFoundation #VikarabadDistrict #GreenfieldKitchen #AkshayaPatra #Students #Education #BreakfastScheme #MiddayMealsScheme #WomenEmpowerment #IndirammaCheeralu #SHGs #RevanthReddy #DamodarRajanarsimha #VakitiSrihari #TelanganaRising2047
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: