Daiva marmamulu January 19🫀 దైవ మర్మములు జనవరి 19 అనుదిన ధ్యానములు.
Автор: Tholisaku Vani🌹Vini
Загружено: 2026-01-18
Просмотров: 26
🌷🌷🌷దైవ మర్మములు - Bro. Bakht Singh🌷🌷🌷
🛐 Daily Devotional 🛐
Theme of the Month: దైవ మర్మములు
Monday, January 19
''నీ దేవుడైన యెహోవా నీ మధ్య నున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషముచేత ఆయన హర్షించును'' (జెఫన్యా 3:17).
మానవులు సంతోషించి ఆనందించుట మీరు చూచియుండవచ్చును. అయితే ఎప్పుడైనా దేవుడు ఆనందించుట, సంతోషముగా నుండుట మీరు చూచియున్నారా? మన సృష్టికర్త సంతోషించినప్పుడు ఆయనేలాగు నుండునో మనలో నెవరము కలలోనైనా చూచియుండము. అయినను దేవుడు సంతోషించుననునది సత్యమే. ''ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును ... నీ యందలి సంతోషముచేత ఆయన హర్షించును''.
బహుశా ప్రభువు పాడుట నీవు వినగలిగితే ప్రభువు, జీవము గల, ప్రేమగల దేవుడు నీ విషయమై హర్షించినప్పుడు నీవెట్టి అనుభూతిని పొందెదవు? నిన్ను ప్రేమించి, రక్షించి, తన ప్రేమను నీ హృదయములో కుమ్మరించిన తరువాత ఆయన నీ విషయమైన సంతోషము చేత హర్షించి పాడుట కారంభించును. చంటిబిడ్డను కలిగిన తల్లిని గమనించుము. ఆమె ప్రేమతో నిండిపోయి ఆ చిన్న బిడ్డను హత్తుకొనుచు, ఎడతెగక ముద్దులిడుచునుండును. ఆమె ముఖము ఆనందముతో వెలిగిపోవుచుండును. ఆ బిడ్డ హృదయములోనికి తన ప్రేమను కుమ్మరించుచు ఆమె పాడుట వినుటకెంతో మధురముగా నుండును. మనము నూతనముగా తిరిగి జన్మించి ఆయన ప్రేమను స్వీకరించుటకు సిద్ధముగా నున్నప్పుడు, దేవుడు కూడా మన విషయమై అలాగు పాటపాడును. ఆయన పాట దేవదూతల పాటకంటెను ఎంతో మధురమైనది. దేవుని ఆనందము అట్టిదే. అట్టి ఆనందమే మనలను దైవిక బలముతో నింపును.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: