Yesu Devuni Ashrayinchuma | New Telugu Christian Songs | Telugu Christian Songs | True Way Gospel
Автор: True Way Gospel Songs
Загружено: 2024-03-25
Просмотров: 711
Yesu Devuni Ashrayinchuma | New Telugu Christian Songs | Latest Telugu Christian Songs | True Way Gospel Songs | TWGS
(మనవి)
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు. విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది. ఎటువంటి ఆర్ధికపరమైన, ఇహలోక సంబంధమైన వాటికై ఎంత మాత్రమును కాదు. ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు. మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును. అందరికీ కృతజ్ఞతలు.
Original Song Link: • Yesu devuni ashrayinchuma,Telugu christian...
Credits:
Lyric & Tune: Lillyan Christopher
Sung by: Sharon Sisters
Music: J K Christopher
Lyrics :
యేసు దేవుని ఆశ్రయించుమా
సోదరా సోదరీ ఈ క్షణమే
విశ్వసించుమా తండ్రిని వేడుమా
గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా?
యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన
రోగియైన దాసుని కొరకు
శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
మాట మాత్రం సెలవిమ్మనగా
విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2)
యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే||
దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను
దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
మొక్కుబడి చేసి ప్రార్థించెను
దీవింపబడెను కుమారుని పొందెను
నీవు అడుగుము నీకివ్వబడును (2)
యేసుని ప్రార్థించుము (2) ||యేసు నామములోనే||
శోధనలెన్నైన సమస్తమును కోల్పోయిన
యోబువంటి విశ్వాసం గమనించుమా
యధార్ధతతో నిరీక్షించెను
రెండంతల దీవెనలు పొందుకొనెను
సహనము చూపుము సమకూడి జరుగును (2)
యేసు నందు నిరీక్షించుము (2) ||యేసు నామములోనే||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: