శ్రీ భవాని శంకర స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా ఆకట్టుకున్న జడకోలాటం...
Автор: శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి ఆలయం_కోట
Загружено: 2025-11-17
Просмотров: 861
తిరుపతి జిల్లా, కోట మండలం, కోట పట్టణంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి ఆలయ ప్రాంగణంలోని శ్రీ భవాని శంకర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాస వనభోజన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల పల్లకిసేవ అత్యంత వైభవంగా జరిగింది. కోట గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభిషేకాలతో పాటు జడకోలాటం భక్తులను ఆకట్టుకుంది.. తూర్పుగోదావరి జిల్లా, శ్రీ మాండవ్య శ్రీనివాస మహిళా కోలాట మండలి మండపేట వారు చేరిన జడకోలాటాన్ని భక్తులు ఎంతో ఆశక్తిగా తిలకించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి- లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించి, ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఉంచి ఆలయం చుట్టు వందలాది మంది భక్తులు సమక్షంలో పల్లకీ సేవను చేపట్టారు. ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించిన దాతలు, భక్తులకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి నిర్వహకులు పెళ్లూరు కోటేశ్వర రెడ్డి, కలిచేటి భాస్కర్ రెడ్డి, నాగలాపురం గిరిధర్ రెడ్డి, కొండూరు వెంకట రమణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, బల్లవోలు సుధాకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: