పరువు,ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలు వేశారని నూతన మేయర్ పాకా సురేష్ కుమార్ 🔥
Автор: STUDIO N9 NEWS
Загружено: 2025-12-12
Просмотров: 59
కడప ....
తనపై ఉన్న వ్యక్తిగత కక్షతో,
పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలు వేశారని నూతన మేయర్ పాకా సురేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కార్పొరేన్ కార్యాలయం లోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. తాను మేయర్ ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా కాకము నుపే కొందరు సర్కిళ్లలో ఫ్లెక్సీలు వేయడం దారుణమ న్నారు. తానంటే గిట్టనివారు వారి ఆక్రోషాన్ని ఎలా చూపాలో తెలియక ఈ విధంగా వెళ్లగక్కారన్నారు. ఇంటి పన్ను అనేది ఎప్పటికైనా కట్టాల్సిందేనని, దాన్ని ఎవరూ మాఫీ చేయలేరన్నారు. ఇప్పుడు కట్టకపోతే ఎన్ని సంవత్సరాలకైనా వడ్డీతో సహా చెల్లించక తప్పద న్నారు. తన తల్లి పేరుతో ఉన్న ఆ ఇంటికి గతంలో రూ.12229 పన్ను వస్తుండగా, ఏడీపీ సర్వేలో భాగం గా దాన్ని పదింతలు పెంచారన్నారు. ఇలా తనకు మాత్రమే జరగలేదని, కడప నగరంలోని 20 వేల మందికి ఈ సర్వే ద్వారా పన్నులు పెంచారన్నారు. జీహెచ్ ఎంసీ యాక్టు ప్రకారం ఇంటి యజమానులకు నోటీసు ఇచ్చిన తర్వాతే పన్ను పెంచాలని స్పష్టంగా ఉందన్నారు. సర్వే పేరిట అసంబద్ధంగా పెంచిన పన్నులను వైఎస్సార్సీపీ కార్పొరే టర్లమంతా తీవ్రంగా వ్యతిరేకిం చామని గుర్తు చేశారు. పలు సర్వ సభ్య సమావేశాల్లో ప్రజలందరి తరఫున తాము ఈ అంశాన్ని లేవ నెత్తి పోరాటం చేస్తే, చివరకు ఏడీపీ సర్వేను నిలిపేశామని అధికారులు చెప్పార న్నారు. ప్లాన్ తీసుకొని ఇల్లు నిర్మించినప్పటికీ, లేన ట్లుగా చూపి చాలా మందికి 100 శాతం ఫెనాల్టీ విధిం చారన్నారు. తమ ఇంటికి పెరిగిన పన్నుపై రివిజన్ పిటిషన్ సమర్పించామని, అధికారులు దానిపై విచారణ చేసి ఇప్పటికీ ఫైనల్ డిమాండ్ నోటీసు ఇవ్వ నందునే పన్ను కట్టలేదని వివరించారు. కార్పొరేషన్ పరిధిలో ఇంకా 976 రివిజన్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఊరు, పేరు లేకుండా వేసే ఫ్లెక్సీలను ముద్రించవద్దని ప్రింటర్ల యజమానులకు సూచించారు. కార్పొరేషన్ అనుమతి పొందిన తర్వాతే ఫ్లెక్సీలు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తామన్నారు. సాదారణ కుటుంబం నుంచి వచ్చిన అత్యున్నతమైన మేయర్ పదవి అధిరోహించా ననే అక్కసుతో ఇలా చేసినట్లు కనిపిస్తోందని, ఫ్లెక్సీలు వేసి సమయం వృథా చేసుకోవద్దని, నగరాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వీలైతే సలహాలు ఇవ్వాలని కోరారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: