#వక్కపొడి
Автор: Life by Dr.Aparna
Загружено: 2021-07-25
Просмотров: 6701
#ADIKEPUDI #VAKKAPODI #BETELNUTPOEDER #MOUTHFRESHNER
వక్కపొడి గురించి
మంచి & చెడు:
మితంగా తీసుకోవడం మంచిది..
షడ్రుచుల భోజనం అనంతరం భుక్తాయాసం తీర్చుకోవడానికి వక్కపలుకులు నోట వేసుకోవడం ఇప్పటికీ చాలామందికి అలవాటు . ఇక శుభకార్యాలకయితే ఆకు ,వక్క లేందే ఆ కార్యానికి నిండుదనమే రాదు . తాంబూలాలు మార్చుకోవడతో వివాహతంతు ప్రారంభమవుతుంది .
వక్కలను అదృష్టానికి ప్రతీకలుగా భావిస్తారు. ఇంటికి వచ్చిన అతిధులు వెళ్ళిపోయే సమయములో వారికి ఆకులు , వక్కలతో తాంబూలం ఇచ్చి సాగనంపడం అతిధి మర్యాదగా భావిస్తారు. ఇక కొత్తపెళ్ళికూతురుని అదృష్టము గా భావించి ఆకులు వక్కలు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారు.
సుగుణాలు : అందరూ భయపడినట్లు వక్కలు ఆరోగ్యానికి హానికరము కాదు వీటిలో సుగుణాలూ ఉన్నాయి.
పొట్టలో చేరిన లద్దెపురుగులు(round worms) , నులిపురుగులు(pin worms) నాశనము చేస్తాయి.
నోటి దుర్వాశన ను పోగొడతాయి ,
దీనిలోని " ఎరికోలిన్ " అనే పదార్ధము మెదడును ప్రబావితం చేస్తుంది ... ఉత్సాహాన్ని కలిగిస్తుంది . హాలహాలు , కెఫిన్ ల తరువాత మానసిక ప్రేరేపిత పదార్ధము గా దీన్ని చెబుతారు.
గుండె జబ్బులతో బాధపడేవారికి దీనిలోని " యాంటీ ఇన్‌ఫ్లమేటరీ " గుణాలు కొంతవరకు మేలు చేస్తాయి.
మత్స్య కారులు ' ఆక్టోపస్ ' వలన కలిగే పుండ్ల కు మందుగా వాడుతారు.
సెల్యులార్ డీజనరేషన్ ను అడ్డుకునే శక్తి వక్కలలోని యాంటీఆక్షిడెంట్లకు ఉన్నది.
స్కిజోఫ్రినియా (మానసిక వ్యాది )నుంచి విముక్తి పొందడానికి వక్కలు పనిచేస్తాయని కొన్ని పరిశోధనల వలన వెళ్ళడైనది.
వక్కలు చెడు గుణాలు :-
వక్కలలో ఆల్కలాయిడ్స్ , టానిన్లు శాతము ఎక్కువగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి హానికరము .
అంతేకాకుండా తరచుగా వక్కలు - ఆకులు కలిపి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని , కాన్సర్లు రావడానికి కారణం అవుతాయని నిపుణులు అంటారు. Due local irritation ,
అదేపనిగా నమలడము వలన 'మతిమరుపు' వచ్చే అవకాశము ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.
వక్కలు , వక్కపొడి గర్భిణిలు,బాలింతలు తీసుకోకూడదు . బిడ్డకు ,తల్లికి దుష్పరిణామాలు కలిగే ప్రమాదము ఉంది.
18 సం.లు లోపు వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు . రక్తము విరిగిపోయే(blood dyscariasis)ప్రమాదము లేకపోలేదు.
ఒక రకమైన మత్తును , హాయిని కలిస్తాయి కనుకనే వీటిని బానిసలయ్యే (adict) ప్రమాదము లేకపోలేదు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: