🔴తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపొప్పురు మండలంలో జరిగిన లాకప్ డెత్ కేసు విచారణ..
Автор: spark9 tvnews
Загружено: 2025-11-24
Просмотров: 759
2021 సంవత్సరంలో పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త ఐన నారాయణ ని పొలం గట్టు తగాదా విషయంలో అప్పటి పెద్దపప్పూరు SI గా పనిచేసిన గౌస్ బలవంతంగా నారాయణను తాడిపత్రి DSP కార్యాలయానికి పట్టుకొని పోవడం జరిగింది.
తాడిపత్రి DSP కార్యాలయంలో అప్పటి DSP చైతన్య మరియు SI గౌస్ విపరీతంగా కొట్టడం వలన స్పృహ తప్పి పడిపోవడం తో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పోలీస్ వారు తరలించడం జరిగింది. కొద్దిసేపటి తరువాత నారాయణ మరణించడం జరిగింది.
నారాయణ మృతి చెందిన తరువాత SI గౌస్ నారాయణ కుటుంబానికి చెందిన వారిని ప్రలోభలకు గురి చేస్తూ 5 లక్షల రూపాయల నగదు 5 ఎకరాల ప్రభుత్వ భూమి నారాయణ కొడుకుకు హోమ్ గార్డ్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ SI గౌస్ మరియు DSP చైతన్య నారాయణ కుటుంబానికి ఏ సహాయం చేయకుండా నారాయణ మృత దేహాన్ని పూడ్చిన తరువాత SI గౌస్ బాధిత కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
నారాయణ మృతి చెందడానికి SI గౌస్ మరియు DSP చైతన్య ప్రధాన కారణం అని నారాయణ భార్య వెంకట లక్ష్మి మరియు కుటుంబ సభ్యులు నిన్న అనగా 21-11-2025సోమనపల్లి గ్రామంలో మీడియా ముందర చెప్పడం జరిగింది.
SI గౌస్ గత YSRCP ప్రభుత్వంలో పెద్దపప్పూరు SI గా మరియు తాడిపత్రి రూరల్ SI గా పనిచేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి కి తొత్తుగా వ్యవహరించాడు. అనేకమంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులు సృష్టించి అరాచకం సృష్టించాడు.
ఈ నారాయణ భార్య వెంకట లక్ష్మి తాడిపత్రి స్థానిక MLA జెసి అష్మిత్ రెడ్డి గారిని జరిగిన విషయం అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా MLA గారు గౌరవ ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ మరియు DGP గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరియు అసెంబ్లీ లో కూడా నారాయణ లాకప్ డెత్ గురించి ప్రస్తావించడం జరిగింది.
గార్లదిన్నె లో పనిచేస్తున్న SI గౌస్ విధి నిర్వహణలో ఉంటే సాక్షులను బెదిరించి విచారణ తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నందున వెంటనే SP గారు మరియు DIG మేడమ్ గారు VR కి తీసుకొనవలసిందిగా కోరుతున్నాము విచారణ ముగిసిన తరువాత SI గౌస్ ని సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాము, SI గౌస్ ని VR తీసుకోని పక్షంలో ఒక వారం రోజుల్లో తాడిపత్రి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కౌన్సిల్ సభ్యులు మరియు భాదితుడు నారాయణ భార్య వెంకట లక్ష్మి కుటుంబ సభ్యులతో సహ గార్లదిన్నే పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తామని తెలియచేస్తున్నాము
#jcashmitreddy #jcprabhakarreddy #tadipatri
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: