వరంగల్ హన్మకొండ జిల్లాలో జాగృతి జనం బాట :
Автор: JAGRUTHI TV
Загружено: 2025-11-10
Просмотров: 41
జాగృతి జనం బాట, వరంగల్
పాలిటిక్స్ పక్కా చేస్తా. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా
కానీ దానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాటం చేస్తా
లాస్ట్ ఇయర్ మాత్రమే రాజకీయాలు చేయాలి. మిగతా నాలుగేళ్లు తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాలు 119 నియోజక వర్గం లోని మండలాలు గ్రామాలు అభివృద్ధి కోసం పోరాటం చేస్తా
పాలక పక్షం, ప్రతిపక్షం పనిచేయటం లేదు. ప్రభుత్వాన్ని అడిగే పని జాగృతి చేస్తోంది
కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే వెళ్తాను. రాజకీయంగా వెళ్లే పరిస్థితి ఇక లేదు
*ఒక బినామీ కంపెనీకి పనులు ఇచ్చారు. అది హరీష్ రావు గారి బినామీ కంపెనీ అని చెప్పకానే చెప్పేశారు కవిత గారు.
*దానిపై విజిలెన్స్ విచారణ వేసిన ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవటం లేదు? అని అడుగుతున్నా అన్నారు కవితక్క
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలి అందుకోసం సామాజిక తెలంగాణ రావాలి అన్నారు.
అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే నా లక్ష్యం.
విద్య, వైద్యం విషయంలో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి వేసుకొని నిద్ర పోయే పరిస్థితి ఉండాలి. అప్పుడే సామాజిక తెలంగాణ వచ్చింది అని నేను నమ్ముతాను.
మహిళలు, విద్యార్థులు, యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావాలి. అంటే
స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు మళ్లీ మొదలు పెట్టాలి. అలాంటప్పుడే కొత్త నాయకత్వం వస్తుంది.
లేదంటే పొలిటిషియన్ పిల్లలు, వాళ్ల చుట్టాలే రాజకీయాల్లోకి వస్తున్నారు.
కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి. అప్పటివరకు
నాలో ప్రశ్నించే తత్వం మారలేదు.
ఇవ్వాళ రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉంది.
ప్రజల తరఫున అడిగేటోళ్లు లేరు. అందుకు మేము ఆ పని చేస్తున్నాం.
జూబ్లీహిల్స్ చిన్న ఎన్నిక. ఈ ఎన్నికల్లో మాకు ఏ స్టాండ్ లేదు.
బీసీ ల విషయంలో మా కమిట్ మెంట్ కొనసాగుతుంది.
బీసీలకు చట్ట సభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం రావాలన్నదే నా లక్ష్యం.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు మొదటి అడుగు మాత్రమే.
20 ఏళ్లు బీఆర్ఎస్ లో పనిచేస్తే నన్ను అవమానకరంగా బయటకు పంపించారు.
కనీసం నాకు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు.
నేను తెలంగాణ బిడ్డనే. ఆకలినైనా తట్టుకుంటా. అవమానాన్ని మాత్రం తట్టుకోను.
కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే వెళ్తాను. కానీ పొలిటకల్ గా మాత్రం వెళ్లాను.
తెలంగాణ వ్యక్తులు రాజులకు, రాజ్యాలకు భయపడరు.
బమ్మెర పోతన గారు అప్పటి రాజు రాజరాజనరేంద్రుడికి తాను రాసిన వాటిని అంకితమివ్వాలంటే అందుకు ససేమిరా అన్నారు.
మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించిన రాణి రుద్రమ గడ్డ ఇది.
వరంగల్ అంటే నేను ఉమ్మడి వరంగల్ గురించే మాట్లాడుతున్నాను.
సమ్మక్క, సారలమ్మ ల గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి.
మా పర్యటన ములుగు జిల్లాకు వెళ్లేసరికి సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది.
దాశరథి గారు పుట్టిన జిల్లా వరంగల్. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది.
అలాంటి ఈ ప్రాంతానికి వస్తు వస్తూనే సమ్మయ్య నగర్ లో ఏకు శ్రీవాణి అనే అమ్మాయి కుటుంబాన్ని కలిశాం.
వెల్ఫేర్ హాస్టల్ లో చదవుకునే శ్రీవాణి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
నిన్నటి పర్యటనలో మాదన్న పేట చెరువు, కాకతీయ విద్యార్థులతో ఛాయ్ పే చర్చా, ఇక్కడి లైబ్రరీ, ఎంజీఎం హాస్పిటల్ కు వెళ్లాం.
కటాక్షపురం బ్రిడ్జి ని పనులకు సంబంధించి కూడా పరిశీలించాం.
నా ఈ పర్యటనతో చాలా మంది జాగృతి గత పదేళ్లలో ఏం చేసిందని అడగవచ్చు?
కానీ పదేళ్లలో కూడా ఇంటర్నల్ గా సమస్యలపై కొట్లాడాను.
ఐతే కేంద్రంలో మూడు సార్లు గెలిచిన బీజేపీ తో మనకు పైసా పని కాలేదు.
ఒక్క పెద్ద సమస్యను కూడా వాళ్లు తీర్చలేదు.
అందుకే మనం తెలంగాణ బిడ్డలుగా ఆలోచన చేయాలి.
నేను ఓట్లు అడగటానికి రాలేదు.
బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నన్ను నిజామాబాద్ లో పరిమితం చేశారు.
ప్రోటోకాల్ అనే తాడుతో నన్ను కట్టడి చేశారు.
ఉద్యమంలో బతుకమ్మ సంబరాల్లో తెలంగాణలోని ప్రతి పల్లె తిరిగాను.
కానీ ఆ తర్వాత నన్ను నిజామాబాద్ కు మాత్రమే పరిమితం కావాలన్నారు.
బీఆర్ఎస్ లో నేను మంత్రిని కాదు. సంతకంతో పనులు అయిపోయే పరిస్థితిలో లేకుండే.
కానీ నా వద్దకు వచ్చిన వారికి శక్తిమించి పనులు చేసేందుకు ప్రయత్నించా.
సీకేఎం కాలేజ్ ప్రొఫెసర్ గంగాధర శర్మ గారిని అడగండి. ఆ కాలేజ్ ను ప్రభుత్వ కాలేజ్ చేయాలని ప్రయత్నించిన కాలేదు.
సీఎం కూతురిని అయినప్పటికీ నాకే పని కావటానికి ఏడాది పట్టింది.
ఆ విధంగా నన్ను కట్టిడి చేసినప్పటికీ...ఎన్నో సమస్యలను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాను.
బీఆర్ఎస్ నుంచి నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు.
అయినప్పటికీ నాకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ, అవగాహనతో పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాను.
ఫ్రెంచ్ విప్లవం అనేదిస్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదంతో ప్రారంభమై
అలాగే నీళ్లు, నిధులు, నియామాకాలు అనే నినాదంతో తెలంగాణను కూడా సాధించుకున్నాం.
కానీ తెలంగాణలో ప్రతి వర్గానికి న్యాయం జరగలేదు.
ప్రతి కుటుంబంతో పాటు అన్ని వర్గాలు బాగుపడాలనే నేను పోరాటం చేస్తున్నాను.
అది సామాజిక తెలంగాణ ద్వారానే సాధ్యమవుతుంది.
అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అందరికీ కావాలి.
అవకాశం వస్తే అధికారం వస్తుంది.
ఒక బీసీ బిడ్డకు అవకాశం వస్తే అధికారం వస్తుంది.
కుల వివక్ష తీస్తేనే ఆత్మగౌరవం వస్తుంది. లేదంటే పైసా ఉండాలి.
నాకు తెలిసి రెండే కులాలు. పైసలు ఉన్న కులం, లేని కులం.
పైసలు ఉంటే కులం అడగకుండా ఫైవ్ స్టార్ రేంజ్ లో మర్యాద ఇస్తారు.
పైసలు ఉంటే ఆటోమేటిక్ గా ఆత్మగౌరవం వస్తుంది.
కానీ ఆ డబ్బు ఎలా రావాలి? ఇండియా ఈజ్ రిచ్. ఇండియా ఈజ్ పూర్ అంటారు.
తెలంగాణ కూడా ధనిక రాష్ట్రం అంటాం. కానీ తెలంగాణలో అందరి వద్ద డబ్బు లేదు.
ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వాతంత్రం కావాలి.
రిజర్వేషన్లతో అవకాశాలు కాకుండా అందరికీ సమానంగా అవకాశాలు రావాలి.
రామన్న పేట ప్రాంత, రాయపుర లాంటి ప్రాంతాల్లో పనులను పెండింగ్ పెట్టారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: