శ్రీ పురుహూతిక శక్తిపీఠం | పిఠాపురం | అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం | లక్షకుంకుమార్చన
Автор: Samaja Darsini
Загружено: 2025-12-08
Просмотров: 305
శ్రీ పురుహూతిక #శక్తిపీఠం #పిఠాపురం #అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం #pithapuram #Lakshakumkumarchana
#కుక్కుటేశ్వర #దేవాలయం #ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురంలో ఉంది, ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది; ఇక్కడ శివుడు **కుక్కుటేశ్వర స్వామి**గా పూజలందుకుంటాడు, ఆలయ ప్రాంగణంలో పురుహూతికా దేవి ఆలయం (ఒక శక్తి పీఠం) కూడా ఉంది, ఇది పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
పురుహుతికా క్షేత్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉంది. దక్షిణ కాశీగా ఈ క్షేత్రం పిలవబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరింది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం..
దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవీ ఆ యజ్ఞవాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయ తాండవం చేశాడు మహేశ్వరుడు. లయకారకుడైన శివుడు తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువయింది. దీన్ని గమనించిన ఆది పరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీమహావిష్ణువుని ఆజ్ఞాపించింది. అమ్మ ఆనతి మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా, అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయనీ, ఇలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తిపీఠాలుగా పూజలందుకుంటున్నాయనీ పురాణాలు తెలియజేస్తున్నాయి. వీటిలో పిరుదుల భాగం పడిన ప్రాంతం పిఠాపురం. మిక్కిలి ప్రసిద్ధిచెందిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది పదవది. పురూహుతికా దేవిగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటోంది.
Video, edited and executed by Muktevi Prakasa Rao
music #srinivaskounduri #youtubeaudiolibrary
Follow us
/ samajadarsini
http://www.samajadarsini.com
/ sociojournalism
/ darsinisamaja
/ samajadarsini
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: