🔴18-01-2026 || ఆదివారము ఆరాధన || SUNDAY WORSHIP LIVE || 𝗆𝖾𝗌𝗌𝖺𝗀𝖾 𝖻𝗒 𝖯𝖺𝗌. 𝖩𝗈𝗌𝗁𝗂 𝖺𝗇𝗇𝖺
Автор: Brooks Church VIsakhapatnam
Загружено: 2026-01-17
Просмотров: 945
#christmasdecor #christmas # #brookschurch
#brookschurch #christiansongs #jesus #kurmannapalem #visakhapatnam #church #pastorjoshi
18.01.2026 SUNDAY SONGS:
Song-1 D-Minor
గుండెల్లో నిండిన నాకున్న భావన
చెప్పాలి నీకే రీతిన
కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా.
యేసయ్యా... యేసయ్యా.......
చేస్తున్నా స్తోత్రాలాపన.
నీకే ఆరాధన....
నీకే ఆరాధన.....
నా కన్ను చూడని ఆశ్చర్యకార్యాలు
జరిగాయి నీ వలన
నీ గోప్ప నామమును పాడి స్తుతిస్తూన్నా
అన్ని వేళలా యందును.
యేసయ్యా.... యేసయ్యా....
చేస్తున్నా స్తోత్రాలాపన.
నీకే ఆరాధన.....
నీకే ఆరాధన......
నా ఉహకందని మహోపకారాలు
కలిగాయి నీ వలన.
ఉత్సాహగానముతో నీన్నె సేవిస్తున్నా
నీ ఆవరణమందున
యేసయ్యా.... యేసయ్యా....
చేస్తున్నా స్తోత్రాలాపన
నీకే ఆరాధన..
నీకే ఆరాధన.....
Song-2 F-Minor
షారోను రోజావే – నా ప్రాణ స్నేహమే
నిర్దోష రక్తమే – దైవ గొర్రెపిల్లవే
సుందరుడవు – నీవు సుందరుడవు
పదివేలలో నీవు శ్రేష్టుడవు
సుందరుడవు – బహు సుందరుడవు
పదివేలలో అతిశ్రేష్టుడవు
హోసన్నా – ఉన్నత దైవమా
హోసన్నా – దావీదు తనయుడా
స్నేహితులు మరచిపోయినా – బంధువులే విడిచిపోయినా
తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే
సహచారివే సహచారివే
వేదనలో ఆదరించే నా ప్రియుడవే
రోగపు పడకలోన – నిరీక్షణ కోల్పోయినా
నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే
పరిహారివే – పరిహారివే
నా వ్యాధులు భరియించిన యేసువే
Song-3 D-Major
నే తెరిచే తలుపులన్నీ తరచుగా మూసితివి
కోపించి పగనుంచినా నవ్వుతూ చూసితివి
నే తలిచే మార్గములన్నీ తరచుగా మూసితివి
కన్నీళ్లతో దుఃఖించినా కౌగిలిలో దాచితివి
మూయుటకు కారణం ఈ మూర్ఖునికి తెలిసినదే
అడిగిన దానికంటే అధికమే పొందితినే
మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే
అడిగిన దానికంటే ఎక్కువే పొందితినే
నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి
కోరికలన్నీ తీర్చితివి
మూర్ఖునని నీవెరిగినా కౌగిలిలో బంధించితివి
ఆశలన్నీ ఎరిగితివి
కోరికలన్నీ తీర్చితివి
మూఢుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి
తండ్రులెవరైననూ చేపనడిగితే పామునిచ్చునా
తండ్రీ నిన్ను దయ మాత్రమే వేడితిని
నీకు వేరుగా నేను ఏదియు కోరలేను
ఆశలే నా ఊసై తాకనీ జనుల మనసును.
తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను
జీవముకు అర్ధము నీ వాక్యమే తెలిపెను
మది లోతులన్నీ నీవు మాత్రమే ఎరిగితివి
కలవరములన్నీ నీవే గ్రహియించితివి
ఏది ఏమైనగాని నీ సన్నిధి నేను చేరెదను
ఎవరి ఎగతాళి మించినా నీ చిత్తమే చేయసాగెదను
ఎవ్వరికి తెలియని సంగతులు ఎరిగితివి
లోతైన గాయము నీ ప్రేమతో మాన్పితివి
Song-4
స్థిరపరచువాడవు బలపరచువాడవు
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు
ఘనపరచువాడవు హెచ్చించువాడవు
మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు
ఏమైనా చేయగలవు స్థితి మొత్తం మార్చగలవు
నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు
యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే మా జీవమున్నది
మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి
నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?
నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా?
మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును
అపవాది తలచిన కీడులన్ని మేలైపోవును
Facebook Pagelink
https://www.facebook.com/Joseph-Job-1...
our Contact Details-9985058781,9052128898
Our Address
BROOKS MINISTRIES
Phakeer Thakya Road,
kurmannapalem,
Visakhapatanam ,
Andhra Pradesh 530046
India.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: