సిద్ధవటం మండలాన్ని కడపలోనే కొనసాగించాలి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
Автор: AP HOT NEWS
Загружено: 2025-12-01
Просмотров: 931
సిద్ధవటం మండలాన్ని కడపలోనే కొనసాగించాలి అని కలెక్టర్ గారికి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు వినతి.
కడప నగరానికి అత్యంత సమీపంలో ఉన్న సిద్ధవటం మండలాన్ని కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఉంచాలని కోరుతూ, స్ధానిక ప్రజలు ఇచ్చిన వినతి ఈరోజు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు సిద్ధవటం మరియు ఒంటిమిట్ట ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కడపకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధవటాన్ని, ఎక్కడో దూరంగా ఉన్న రాజంపేట డివిజన్ (అన్నమయ్య జిల్లా) పరిధిలోకి మార్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని కలెక్టర్ గారికి వివరించారు. ప్రజల సౌలభ్యం దృష్ట్యా సిద్ధవటాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని వినతిపత్రం అందజేశారు.
అనంతరం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ.. ఈ సమస్యను త్వరలోనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి, సిద్ధవటం మండలాన్ని కడప జిల్లా నుండి విడదీయకుండా ఉండేలా సానుకూల నిర్ణయం వచ్చేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: