class 14 | VEY | TENSES | prabha palukulu | spoken tamil |
Автор: PRABHA PALUKULU
Загружено: 2020-04-15
Просмотров: 13081
#prabhapalukulu#spokentamil#throughtelugu#
వెయ్ - పెట్టు
PRESENT TENSE
వెక్కిరేన్(పెడుతున్నాను), వెక్కిరే(పెడుతున్నావు)
వెక్కిరాల్(పెడుతుంది), వెక్కిరాన్(పెడుతున్నాడు)
వెక్కిరీంగ(మీరు పెడుతున్నారు), వెక్కిరాంగ(పెడుతున్నారు ) వెక్కిరోం(పెడుతున్నాము)
వెక్కిరదిల్లే( పెట్టడంలేదు)
వెక్కిరదిల్లియా?(పెట్టడం లేదా? )
EX.నాన్ మెయిల్ వెక్కిరేన్-
నేను మెయిల్ పెడుతున్నాను
నీ యారుకు మెస్సేజ్ వెక్కిరే-
నువ్వు ఎవరికి మెసేజ్ పెడుతున్నావు
అవల్ టేబుల్‌మేల కాసు వెక్కిరాల్-
ఆమె టేబుల్ మీద డబ్బులు పెడుతోంది
అవన్ వీసా కాగ అప్లికేషన్ వెక్కిరాన్-
అతడు వీసా కోసం అర్జీ పెడుతున్నాడు
నీంగ ఫ్రిజ్జిల్ ఎన్న వెక్కిరీంగ-
మీరు ఫ్రిజ్‌లో ఏం పెడుతున్నారు
అవంగ మాంగా ఊరగాయ్ వెక్కిరాంగ
వారు మామిడికాయ పచ్చడి పెడుతున్నారు
నాంగ కాసు సేతి వెక్కిరోం-
మేం డబ్బులు కూడబెడుతున్నాం
వెక్కిరదిల్లే( పెట్టడంలేదు)
లాక్‌డౌనిల్ నరియపేరు వీటిలిరుందు కాలు వెలియ వెక్కిరదిల్లే
లాక్‌డౌన్‌లో చాలామంది ఇంట్లోంచి కాలు బయట పెట్టడంలేదు
అవన్ అవనొడ అమ్మావుక్కు సాపాడు వెక్కిరదిల్లే
అతడు అతని తల్లికి భోజనం పెట్టడం లేదు
శిల హాస్టలిల్ నాన్‌వెజ్ వెక్కిరదిల్లే
కొన్ని హాస్టల్లో నాన్‌వెజ్ పెట్టడం లేదు
ఎంగ హాస్టలిల్ నల్లా సాపాడు వెక్కిరదిల్లే
మా హస్టల్‌లో మంచి భోజనం పెట్టడంలేదు
అంద పసంగల్ పడిప్పుమేల ఇంట్రెస్ట్ వెక్కిరదిల్లే
ఆ పిల్లలు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టడంలేదు
ఏపీయిల్ కరోనావాల్ తేర్‌దల్ వెక్కిరదిల్లే
ఏపీలో కరోనా వల్ల ఎన్నికలు పెట్టడం లేదు
వెక్కిరదిల్లియా?(పెట్టడం లేదా? )
ఇనికి లంచ్ బాక్సు వెక్కిరదిల్లియా?-
ఈరోజు లంచ్ బాక్సు పెట్టడం లేదా?
PAST TENSE
వెచ్చిటేన్(పెట్టాను), వెచ్చిటే(పెట్టావు)
వెచ్చిటాల్ (పెట్టింది), వెచ్చిటాన్(పెట్టాడు)
వెచ్చిటీంగ( పెట్టారు), వెచ్చిటాంగ(పెట్టారు)
వెచ్చిటోం(పెట్టాం)
వెక్కలే(పెట్టలేదు)
వెక్కలియా?(పెట్టలేదా?)
EX. నాన్ రిజిస్టరిల్ సైన్ వెచ్చిటేన్-
నేను రిజిస్టర్‌లో సంతకం పెట్టాను
నీ ఉనకాదా ఎల్లా సెలవు వెచ్చిటే-
నువ్వు నీకోసమే అంతా ఖర్చు పెట్టావు
అవనొడ బాలై నీ ఎంగే ఒలిచి(మరైచి) వెచ్చిటే
అతని బాల్‌ను నువ్వు ఎక్కడ దాచి పెట్టావు
ఎంగ అమ్మా ఎంగల్‌కాగ సాపాడు సెంజి వెచ్చిటాల్
మా అమ్మ మాకోసం భోజనం చేసి పెట్టింది
నీంగ ఎంగ బుక్స్ ఎంగే వెచ్చిటీంగ
మీరు మా బుక్స్ ఎక్కడ పెట్టారు
అవంగ నమ్మల్ కాగ నరియ సెలవు వెచ్చాంగ
వారు మన కోసం చాలా ఖర్చు పెట్టారు
ఆన్‌లైనిల్ కరెంట్ బిల్లు వెచ్చోం కట్టుంగ
ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు పెట్టాం.. కట్టండి
వెక్కలే (పెట్టలేదు), వెక్కలియా- పెట్టలేదా?
నాన్ అంద బీరువాయిల్ కాసు వెక్కలే
నేను బీరువాలో డబ్బు పెట్టలేదు
అంద పడత్తుక్కు ఇన్ను పేరు వెక్కలే
ఆ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు
FUTURE TENSE
వెప్పేన్(పెడతాను), వెప్పే(పెడతావు),
వెప్పాల్( పెడుతుంది), వెప్పాన్(పెడతాడు),
వెప్పీంగ(పెడతారు), వెప్పాంగ(పెడతారు)
వెప్పోం(పెడతాం)
వెక్కమాట్టేన్ (పెట్టను), వెక్కమాట్టే(పెట్టవు),
వెక్కమాట్టాల్(పెట్టదు), వెక్కమాట్టాన్(పెట్టడు),
వెక్కమాట్టీంగ(పెట్టరు), వెక్కమాట్టాంగ(వారు పెట్టరు)
వెక్కమాట్టోం(పెట్టము),
వెక్కమామాట్టియా? (పెట్టవా )
వెక్కమాట్టీంగ్లా? (పెట్టరా? )
నా వెలియిరుందు ఉల్ల వందఉడనే గేట్ వెప్పేన్-
నేను బయటి నుంచి లోపలికి రాగానే గేటు వేస్తా
నీ ఎదుకు తొడపకట్ట వెలియ వెప్పే
నువ్వు ఎందుకు చీపురకట్ట బయట పెడతావు
ఎంగ అమ్మా కాఫీ నల్లా వెప్పాల్
మా అమ్మ కాఫీ బాగా(మంచిగా) పెడుతుంది
ఫోన్ పన్నా ఎన్ నన్బన్ సినిమా టికెట్స్ ఎడుత్తి వెప్పాన్
ఫోన్ చేస్తే నా స్నేహితుడు సినిమా టికెట్లు తీసి పెడతాడు
ఎదు కుడుత్తాలుం నీంగ ఎదుకు ఉంగ పయ్యన్‌కాగ వెప్పీంగ
ఏదిచ్చినా మీరు ఎందుకు మీ అబ్బాయి కోసం పెడతారు
కొలందైగల్‌కు బుక్ కుడుత్తా కిలిచి వెప్పాంగ
పిల్లలకు పుస్తకం ఇస్తే చింపి పెడతారు
నాంగ పసియిల్ ఇరుకురవంగల్‌కు సాపాడు వెప్పోం
మేం ఆకలితో ఉన్నవారికి భోజనం పెడతాం
ఇంకా కొన్ని.. వివరంగా...
వెక్క(పెట్టడం)- వెక్క తెరియాదు- పెట్టడం తెలియదు
వెక్క తెరియురదిల్లే- పెట్టడం తెలవడంలేదు
వెచ్చదుకప్రం( పెట్టాక) సొల్లువాంగ- పెట్టాక చెబుతారు
ATMలో డబ్బులు పెట్టాక చెబుతారు
వెక్కామె( పెట్టకుండా)- వెక్కామె వెచ్చ మాదిరి సొల్లిటాన్
పెట్టకుండా పెట్టినట్లు చెప్పాడు
వెచ్చి(పెట్టి) సొల్లు- పెట్టి చెప్పు
పెట్టకూడదు(వెక్కకూడాదు)- ఇంగే ఎదువుం వెక్కకూడాదు
ఇక్కడ ఏమీ పెట్టకూడదు
పెట్టొద్దు(వెక్కాదు)- ఫోన్ సైలెంట్‌ల వెక్కాదు
ఫోన్ సైలెంట్‌లో పెట్టొద్దు
వెక్కనో( పెట్టాలి)- పసంగల్‌కు నల్లా సమైచ్చి వెక్కనో
పిల్లలకు బాగా వండి పెట్టాలి
పెట్టనీయడం లేదు( వెక్కవిడురదిల్లే)
అవనొడ అల్మారాయిల్ తుని వెక్కవిడురదిల్లే-
అతని అల్మారాలో దుస్తులు పెట్టనీయడం లేదు
వెక్క విడు- పెట్టనివ్వు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: