తీర ప్రాంతాల అభివృద్ధికి మణిహారం వందే భారత్ ఎక్స్ప్రెస్: శ్రీనివాస్ వర్మ
Автор: TVR Telugu TVR Telugu
Загружено: 2025-12-15
Просмотров: 104
నరసాపురం నుంచి చెన్నైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా:
నరసాపురం నుంచి చెన్నైకి నూతనంగా ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు.
అలాగే ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, వెనిగండ్ల రాము, బాలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోతి తదితరులు హాజరయ్యారు. పలు కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నరసాపురం–చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయని నాయకులు తెలిపారు. ఈ రైలు ద్వారా ప్రాంత అభివృద్ధికి, వాణిజ్య అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని వారు పేర్కొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: