ఆహ్లాదాన్ని పంచేలా రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్
Автор: KRISHNATPGMEDIA
Загружено: 2025-12-17
Просмотров: 13
#apnews #latestnews #tadepalligudem #telugu
చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరికి ఆహ్లాదాన్ని పంచేలా రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిలుస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ సమీపంలో రహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి స్నో సిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పిల్లల్ని ఎంతో ఆకట్టుకునేలా స్నో సిటీ ఉందన్నారు. జెయింట్ వీల్, దెయ్యాలకోట, మహిళల అలంకరణ స్టాల్స్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఇటువంటి ఎగ్జిబిషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా నిత్యం ఒత్తిడితో ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుందన్నారు. తద్వారా మరి కొంతమందికి ఉపాధి లభిస్తుందన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్ ను తాడేపల్లిగూడెం పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ప్రతీ ఒక్కరూ ఆదరించాలని కోరారు. నిర్వాహకుడు అబ్దుల్ మొహిద్దీన్ ఖాన్ మాట్లాడుతూ 19వ తేదీన నుంచి ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. పట్టణ ప్రజలు అభిలాష కనుగుణంగా తీర్చిదిద్దామన్నారు. అందరినీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ఆదరించాలని కోరారు. జనసేన పెంటపాడు మండలం అధ్యక్షుడు పుల్ల బాబి, వంకిన కృష్ణారావు, నిర్వాహకులు అబ్దుల్ మొహిద్దీన్ ఖాన్ & కుటుంబ సభ్యులు, మేనేజర్ చింతకాయల దొరబాబు, సీపీఐ పట్టణ నాయకుడు మండల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: