JOLO JOLO JOLALO || OOGAVE YELLAMMA UYYALO || BONALU SONG || KUMBALA GOKUL || SVC RECORDING
Автор: SVC Recording Company
Загружено: 2023-06-30
Просмотров: 98406
#JOLOJOLOJOLALO #SVCRECORDINGCOMPANY #OOGAVEYELLAMMAUYYALO #BONALUSONG2023 #KUMBALAGOKULBONALUSONG #GOKULYELLAMMASONG #MAHANKALIJATARA2023SVC #SVCBONALUSONGS2023 #BONAL2023 #BONALUSONGS #NEWBONALUSONGS #LATESTBONALUSONGS #CLEMENTANNASONGS #CLEMENTFOLKSONGS #BONALUDJSONGS #DJSHABBIRBONALUSONGS #BALAKAMPETYELLAMMASONGS #YELLAMMASONGS #RAMARAMAYELLAMMAKUDJSONG #GOLCONDAYELLAMMASONG2023 #TELANGANABONALU2023 #TELANGANABONALU #LASHKARBONALU2023 #YELLAMMAUYYALASONG #SVCBONALU2023 #KUMBALAGOKULBONALUSONGS
Lyrics & Vocals: Kumbala Gokul
Keyboard Programming: Naveen Sambari
Music : Gyaneshwar Yadav
Rhythms Mix: DJ Shabbir
Additional Vocals: Kiran Mudiraj
D.O.P & Editing: Santhosh Kodam
Poster Design: Shiva Podishetty
Music, Recording, Sound Engineer & Producer: Vonguru Gyaneshwar Yadav
పల్లవి ॥
కాలు కదిలించవే రేణుకమ్మ గజ్జ కదిలించవే ఎరుకలమ్మ
కత్తి చేత పట్టుకోని నాగులమ్మ కదం తొక్కి ఆడవే జోగులమ్మ
అమ్మా నీకిష్టమైన ఆషాఢం వచ్చిందమ్మ
అంతరాల తొట్టెల నీకోసం తెస్తమమ్మ
జోలో జోలో జోలాలో ఊగవే ఎల్లమ్మ ఉయ్యాలో
జోలో జోలో జోలాలో ఊగవే ఎల్లమ్మ ఉయ్యాలో
చరణం 01॥
పుట్టలో పాములతో పుట్టినా తల్లి నీకు
పుట్టంగ పురుడు లేదు తొట్టెలెవ్వరూపలేదు
పత్తి పువ్వు మీద పవళించిన దేవి నీకు
పట్టు పరుపులే లేవు పాటెవ్వరు పాడలేదు
నా అంశవు నీవని శివుడు నిన్ను ఎత్తుకొని
పార్వతమ్మ పొత్తిళ్ళనే నీకు పరుపు చేసినాడు
జోలో జోలో జోలాలో ఊగవే ఎల్లమ్మ ఉయ్యాలో
జోలో జోలో జోలాలో ఊగవే ఎల్లమ్మ ఉయ్యాలో
చరణం 02॥
అంతెత్తు ఆకాశమే నీ ఊయల దూలమమ్మ
గర్జించే పులి తోళ్ళే నీకు పట్టు పాన్పులమ్మ
బుసలు కొట్టే పాములే నీ ఊయల తాడులమ్మ
గుబురు యాపకొమ్మలే నీ వింజామరలమ్మ
అందరి గాధలు విని అలిసినావు ఓ తల్లీ
అద్దాల మండపములో నిదురించవే నా తల్లీ
జోలో జోలో జోలాలో ఊగవే ఎల్లమ్మ ఉయ్యాలో
జోలో జోలో జోలాలో ఊగవే ఎల్లమ్మ ఉయ్యాలో
చరణం 03॥
పిలువంగానే తల్లీ పరుగున మా వద్దకొచ్చి
కష్టాలను తీర్చేసే నీ కాళ్ళను పడతాము
పంచరంగుల పటాలలో పరవసించి ఆడి ఆడి
నొప్పులయ్యినా నీ పాదాలే వత్తుతాము
చీమ చిటుకుమనకుండ కాపు కాస్తామమ్మ
మా సేవలు అందుకుంటు సేద తీరు మాయమ్మ
జోలో జోలో జోలాలో ఊగవే ఎల్లమ్మ ఉయ్యాలో
జోలో జోలో జోలాలో ఊగవే ఎల్లమ్మ ఉయ్యాలో
చరణం 04॥
కళ్యాణ బలమిచ్చే సంతాన భాగ్యమిచ్చే
కోరిన వరమిచ్చే కొలుపే నీ తోట్టెల
అందుకే నమ్ముకున్న భక్తులంత నీకోసం
యేటేటా తెస్తరమ్మ అంతరాల తొట్టెల
భక్తులే తెచ్చిన పూల తొట్టెలెక్కమ్మా
బిడ్డ పాడే జోల వింటు ఓ కునుకు తీయవమ్మ
జోలో జోలో జోలాలో ఊగవే ఎల్లమ్మ ఉయ్యాలో
జోలో జోలో జోలాలో ఊగవే ఎల్లమ్మ ఉయ్యాలో
Get Subscribe For more Regular updates on our YouTube channel
/ @svcrecordingcompany239
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: