వ్యక్తిత్వమే ఊపిరిగా (ఎందుకూ పనికిరాని, నీకోబోడి వ్యక్తిత్వం. దాన్నలాగే జాగ్రత్తగా బ్యాంక్ లో దాచుకో
Автор: కథ కాలక్షేపం
Загружено: 2025-10-23
Просмотров: 10976
వ్యక్తిత్వమే ఊపిరిగా (ఎందుకూ పనికిరాని, నీకో బోడి వ్యక్తిత్వం. దాన్నలాగే జాగ్రత్త చేసి బ్యాంక్ లాకర్లో దాచుకో. జీవితాంతం నిన్నది జాగ్రత్త చేస్తుంది.
రచన అంగులూరి అంజనీదేవి
ఫణీంద్రకి తన పెళ్లి విషయంలో ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు. ఎవరు నచ్చితే వాళ్లను పెళ్లి చేసుకునేంతటి స్వేచ్ఛ అతనికుంది. నీలిమను మనస్ఫూర్తిగా ఇష్టపడటం వల్లనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
నీలిమ తండ్రి ఒక పల్లెటూరులో వ్యవసాయ కూలి. ఆమె పుట్టి పెరిగింది ఆ ఊరిలోనే. తల్లి లేకపోయినా తన కొచ్చే సంపాదన లోనే అన్ని ముచ్చట్లు తీర్చుతూ అపురూపంగా పెంచుకున్నాడు ఆమె తండ్రి. తండ్రంటే పంచప్రాణాలు నీలిమకి.
మొదటి రాత్రి సందర్భంగా చుట్టు పక్కల ఆడవాళ్లంతా నీలిమను చక్కగా అలంకరించారు. వాళ్ల అభిమానం చూస్తుంటే నీలిమకు తల్లిలేని లోటు కనబడలేదు. ముహూర్త సమయం చెప్పి ఆ దంపతులిద్దరిని గదిలోకి పంపారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: