కడప మొబైల్స్ టెక్నీషియం అసోసియేషన్ వార్షికోత్సవ కార్యక్రమం
Автор: AP న్యూస్ 55
Загружено: 2025-12-01
Просмотров: 9
మొబైల్ షాప్స్ టెక్నీషియన్ సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్ పనిచేస్తుంది.
కడప మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ నాయకులు
కడప నవంబర్ 30
మొబైల్ షాప్స్ టెక్నీషియన్ సంక్షేమమే లక్ష్యంగా కడప మొబైల్స్, టెక్నీషియన్ అసోసియేషన్ పనిచేస్తుందని అసోసియేషన్ నాయకులు అన్నారు. ఆదివారం కడప నగరంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ నందు కడప మొబైల్స్, టెక్నీషియన్ అసోసియేషన్ యొక్క మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సైబర్ క్రైమ్ సీఐ మధు మల్లేశ్వర రెడ్డి, మొబైల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ లు హాజరయ్యారు.కడప మొబైల్స్ అసోసియేషన్ సంబంధించి ఐడి కార్డులను గౌరవ అతిథులు చేతుల మీదుగా పంచడం జరిగింది.అనంతరం సైబర్ క్రైమ్ సిఐ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై మొబైల్ షాప్ యజమానులకు టెక్నీషియన్లకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించడంపై కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. అలాగే అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అసోసియేషన్కు సంబంధించిన ఒక షాపుకు గాని టెక్నీషియన్ గాని సమస్యలు వచ్చినప్పుడు అసోసియేషన్ తప్పకుండా వారి పక్కన
నిలబడుతుందని హామీ ఇచ్చారు.అసోసియేషన్ నిర్మాణం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
అలాగే భవిష్యత్తులో మొబైల్ షాప్ ఓనర్లకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, వారి సమస్యలను పరిష్కరించడానికి అసోసియేషన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
అలాగే మొబైల్ షాప్ ఓనర్లకి టెక్నీషియన్లకి మొబైల్ అన్లాక్ చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు, అమ్మేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జమీల్, ఉపాధ్యక్షుడు రహమాన్, జనరల్ సెక్రటరీ చెప్పలి పుల్లయ్య, కోశాధికారి వాహబ్, సెక్రటరీ షఫీ ఉల్లా, ఎగ్జిక్యూట్ మెంబర్స్, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నగరంలోని అన్ని మొబైల్ షాప్ల నుంచి పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: