పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో MLA అమరనాథరెడ్డి శనివారం పాల్గొన్...
Автор: MC 9 NEWS TELUGU
Загружено: 2025-11-22
Просмотров: 234
పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో శాసనసభ్యులు అమరనాథరెడ్డి శనివారం పాల్గొన్నారు. ద్ధల కుప్పం వయ కే.గొల్లపల్లి మీదుగా ఎస్ బండపల్లి వరకు రూ. 1.10 కోట్లతో నిర్మించనున్న సిసి రోడ్డుకు భూమి చేశారు. అనంతరం లింగాపురం వద్ద ఏర్పాటుచేసిన 33/11 సబ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కూటమి నాయకులు విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఆయన వివరించారు . ఈ కార్యక్రమంలో రెస్కో చైర్మన్ ప్రతాప్, వైస్ చైర్మన్ విశ్వనాథ్, ట్రాన్స్ కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈ లు శ్రీనివాస మూర్తి, భాస్కర్ నాయుడు, ఏడిఈ జీవన్ కుమార్, రెడ్డి కుమార్, బాబు లతోపాటు పలమనేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్ర నాయుడు,రాంబాబు రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: